AP జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP NHM Jobs Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ జాతీయ ఆరోగ్య మిషన్
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం , హెల్త్ , మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా చిత్తూరు జిల్లా నందు గల ఆల్కహాల్ & డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నందు ఒక సంవత్సరం పాటు పని చేసేందుకు గాను వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఆఫ్లైన్ విధానం ద్వారా నేరుగా లేదా పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకొనే ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అనగా విద్యార్హతలు ఏమిటి వుండాలి ? జీతం ఎంత లభిస్తుంది ? ఏ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి ? వంటి ఇతర అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥జాతీయ ఆరోగ్య మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • చిత్తూరు జిల్లా నందు గల ఆల్కహాల్ మరియు డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయింది.

🔥 జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎనిమిది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • తాత్కాలిక ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు పనిచేసేది గాను ఈ ఉద్యోగం నియామకం జరుగుతుంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అవి :
  • 1. సైకియాట్రిస్ట్ / మెడికల్ ఆఫీసర్ – 1
  • 2. ప్రాజెక్టు కోఆర్డినేటర్ కం కౌన్సిలర్ – 1
  • 3. డేటా ఎంట్రీ ఆపరేటర్ – 1
  • 4. పీర్ ఎడ్యుకేటర్ – 1
  • 5. చౌకీదారు – 1
  • 6. హౌస్ కీపింగ్ వర్కర్ – 2
  • 7. యోగా థెరపిస్ట్ / డాన్స్ / మ్యూజిక్ / ఆర్ట్ టీచర్ ( పార్ట్ టైం ) – 01

🔥 గరిష్ట వయోపరిమితి :

  • 42 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥 విద్యార్హతలు :

1. మానసిక వైద్యుడు / మెడికల్ ఆఫీసర్ :

  • MCI గుర్తించిన యూనివర్సిటీలో మానసిక వైద్యంలో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి.
  • లేదా, ఎం.బి.బి.ఎస్ డిగ్రీతో పాటు ఎడిక్షన్ మెడిసిన్‌లో ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి.
  • ఏ.పీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

2. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ కౌన్సిలర్ :

  • సెంటర్లను నడిపే సామర్థ్యం , కనీసం 3 సంవత్సరాల అనుభవంతో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి వుండాలి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వుండాలి.

3. డేటా ఎంట్రీ ఆపరేటర్ :

  • అకౌంట్స్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • లేదా, కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా (DCA / PGDCA) ఉండాలి.

4. పియర్ ఎడ్యుకేటర్ :

  • 1–2 సంవత్సరాల మత్తు మందుల నుండి విముక్తి (sobriety)తో జీవించిన మాజీ డ్రగ్ యూజర్ అయి ఉండాలి , విద్యా వంతుడు అయి ఉండాలి.
  • డ్రగ్ వాడే వ్యక్తులతో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి
  • డ్రగ్స్ వాడటం, అమ్మకం, కొనుగోలు చేయదని అంగీకరించాలి
  • మత్తు పదార్థాల వాడకాన్ని నివారించే కార్యాచరణలో భాగం కావాలన్న తాపత్రయం ఉండాలి.

5. చౌకిదార్ ( వాచ్‌మన్ ) :

  • కనీసం 7వ తరగతి చదివి ఉండాలి.

6. హౌస్ కీపింగ్ వర్కర్ :

  • కనీసం 7వ తరగతి చదివి ఉండాలి

7. యోగా థెరపిస్ట్ / డాన్స్ / మ్యూజిక్ / ఆర్ట్ టీచర్ (పార్ట్ టైమ్)

  • సంబంధిత అంశంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి

🔥 దరఖాస్తు విధానం :

  • ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్లు ఇచ్చిన దరఖాస్తులు ఫీల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి నేరుగా లేదా పోస్ట్ ద్వారా మెడికల్ సూపర్ ఇంటెండెంట్ , డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు వారికి 16/09/2025 ( కార్యాలయ పనివేళలలో ) లోగా అందజేయాలి.

🔥 దరఖాస్తు ఫీజు :

  • అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా దరఖాస్తు ఫీజును MR HOSPITAL DEVELOPMENT SOCIETY DIST HQS (CHITTOOR) వారి పేరు మీదుగా చెల్లించాలి.
  • ఓపెన్ క్యాటగిరి అభ్యర్థుల 300 రూపాయలు , బిసి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 200 రూపాయలు , ఎస్సీ మరియు ఎస్టి అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
  • దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు లభించింది.

🔥 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వంద మార్కులు వెయిటేజీ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
  • ఇందులో భాగంగా విద్యార్ధుకు సంబంధించిన అగ్రిగేట్ మార్కులకు 9% వెయిటేజ్ ను , అర్హత విద్యార్హతను పూర్తిచేసిన సంవత్సరాల కి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ ప్రాదిపాతికన గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు.

🔥 వేతనం :

  • ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి క్రింది తెలిపిన విధంగా ప్రతినెలా వేతనం లభిస్తుంది.
  • మానసిక వైద్యుడు / మెడికల్ ఆఫీసర్ – రూ.60,000
  • ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ కౌన్సిలర్ – రూ.25,000
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – రూ.12,000
  • పియర్ ఎడ్యుకేటర్ – రూ.10,000
  • చౌకిదార్ – రూ.9,000
  • హౌస్ కీపింగ్ వర్కర్ – రూ.9,000
  • యోగా / డాన్స్ / మ్యూజిక్ / ఆర్ట్ టీచర్ (పార్ట్ టైమ్) – రూ.5,000

🔥 ముఖ్యమైన తేదీలు :

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : 01/09/2025
  • దరఖాస్తు సమర్పణ : 01/09/2025 నుండి 16/09/2025 ( కార్యాలయ పనివేళలలో )
  • దరఖాస్తులు పరిశీలన : 22/09/2025
  • తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల : 25/09/2025
  • తాత్కాలిక మెరిట్ జాబితా పై ఫిర్యాదుల స్వీకరణ : 25/09/2025 నుండి 03/10/2025 ( పని దినాలలో )
  • ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల : 08/10/2025
  • ఫైనల్ మెరిట్ లిస్టు పై అభ్యంతరాలు స్వీకరణ : 09/10/2025 నుండి 10/10/2025 ( పనిదినాలలో )
  • రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల : 16/10/2025

👉 Click here for notification

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *