ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైళ్ళ శాఖ నుండి వివిధ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడ్డ ఉద్యోగులు సెంట్రల్ ప్రిజన్ , నెల్లూరు నందు పనిచేయవలసి వుంటుంది.
ఆఫ్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకొనే ఈ ఉద్యోగాలకు సంబంధించి అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? ఎంత వయస్సు లోపు గల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ? జీతం ఎంత లభిస్తుంది ? వంటి వివిధ అంశాల సమగ్ర వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents
🔥ఆంధ్రప్రదేశ్ జైళ్ళ శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- జైళ్ళ శాఖ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 జైళ్ల శాఖలో భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఔట్ సోర్సింగ్ ప్రాధిపాతికన ఫార్మసిస్ట్ , ల్యాబ్ టెక్నీషియన్ , ఫైర్ మాన్ భర్తీ చేస్తున్నారు.
✅ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు – Click here
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.
- ఫార్మాసిస్ట్ – 01
- ల్యాబ్ టెక్నీషియన్ -01
- వైర్ మ్యాన్ – 01
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి 42 సంవత్సరాల లోపు వయసు గల అభ్యర్థి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ , ఎస్టీ , బిసి , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కు ఐదు సంవత్సరాల వయోసడలింపు లభిస్తుంది. అనగా వీరికి 47 సంవత్సరాల వరకు అవకాశం లభిస్తుంది.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/08/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
🔥 అవసరమగు విద్యార్హతలు :
- 1. ఫార్మసిస్ట్ : 10వ తరగతి / ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తింపబడిన సంస్థ నుండి ఫార్మసీ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
- అలానే UGC నుండి గుర్తింపు పొందిన సంస్థ నుండి బి ఫార్మసీ ఉత్తీర్ణత సాధించాలి.
- ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ నందు రిజిస్టర్ అయింది నోటిఫికేషన్ విడుదలైన నాటికి రెన్యువల్ లో ఉండాలి.
- 2. ల్యాబ్ టెక్నీషియన్ : పదవ తరగతి / ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి , మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ చేసి ఒక సంవత్సరం క్లినికల్ ట్రైనింగ్ / అప్రెంటిస్ ట్రేడింగ్ పూర్తి చేసి ఉండాలి.
- మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు నందు డిప్లమో ( DMLT ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ నందు బిఎస్సి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఫస్ట్ క్లాస్ బిఎస్సి లైఫ్ సైన్సెస్ / బీఎస్సీ ( బి జెడ్ సి ) ఉత్తీర్ణత సాధించి , SVIMS తిరుపతి నుండి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ నందు పీజీ డిప్లమో ఉత్తీర్ణత సాధించాలి.
- పైన పేర్కొన్న అన్ని కోర్సులు నందు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నందు రిజిస్టర్ చేసుకోబడి వుండాలి.
- 3. వైర్ మ్యాన్ : ఏదైనా గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ITI ) నుండి ఎలక్ట్రిషన్ లేదా వైర్ మెన్ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
🔥 దరఖాస్తు చేయు విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సెంట్రల్ ప్రెసెంట్ నెల్లూరు నందు దరఖాస్తు ను తీసుకోవాలి.
- అభ్యర్థులు దరఖాస్తు తో పాటుగా సంబంధిత ధ్రువపత్రాలను కార్యాలయ చిరునామాకు 15/09/2025 సాయంత్రం ఐదు గంటలలోగా నేరుగా అందజేయాలి.
- అప్లికేషన్ యొక్క ఎన్క్లోజర్ పై “Application for the post of Pharmacist. Lab Technician, Wireman on outsourcing basis which post applied.”
🔥కార్యాలయ చిరునామా :
- Superintendent of Jails, Central prison, Kakuturu Village, Chemudugunta post,Venkatachalam Mandal, SpSR Nellore District-524 320
- (Contact Number: 9985195894, 9676096089)
🔥 దరఖాస్తు తో పాటు జతపరచవలసిన ధ్రువపత్రాలు :
- 1. పూరించిన దరఖాస్తు ఫారం & పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించబడి ఉండాలి.
- 2. 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్
- 3. అన్ని విద్యార్హతలకు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్
- 4. సంబంధిత బోర్డు / కౌన్సిల్ నందు రిజిస్టర్ చేసుకున్న రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- 5.ఇటీవల కుల ధ్రువీకరణ పత్రం ( అవసరమగు వారు )
- 6.4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్ లు
- 7.ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ( వున్న వారు )
- 8. EWS సర్టిఫికెట్ ( అవసరమగు వారు )
- 9.ఆధార్ కార్డు
పైన పేర్కొన్న సర్టిఫికెట్లు అటెస్ట్ చేసి ,దరఖాస్తు తో జతపరచాలి.
🔥ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసేందుకు గాను అభ్యర్థులకు 100 మార్కులకు గాను 75 మార్కులు విద్యార్హత లో వచ్చిన మార్కుల మెరిట్ కి కేటాయించారు.
- 15 మార్కులు పని అనుభవానికి కేటాయించారు మరియు 10 మార్కులు విద్యార్హత ఉత్తీర్ణత సంవత్సరం ( ఒక సంవత్సరం కి ఒక మార్క్) ఆధారంగా ఇస్తారు.
🔥 జీతం :
- ఫార్మసిస్ట్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ గా ఎంపికైన వారికి నెలకు 21500 జీతం లభిస్తుంది.
- వైర్ మెన్ గా ఎంపిక అయిన వారికి నెలకు 18,500 రూపాయలు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 01/09/2025
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 15/09/2025 ( సాయంత్రం 05:00 గంటల లోగా )