PGCIL Notification 2025 : భారత ప్రభుత్వ మహారత్న ఎంటర్ప్రైజ్ మరియు ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాన్స్మిషన్ యుటిలిటీ అయినటు వంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWER GRID) సంస్థ కాంట్రాక్ట్ ప్రాధిపతికన ఫీల్డ్ ఇంజనీర్ మరియు ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాల భర్తీ కొరకు పవర్ గ్రిడ్ కామన్ FTE వ్రాత పరీక్ష ను నిర్వహిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1543 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? విద్యార్హత ఏమిటి వుండాలి ? జీతం ఎంత లభిస్తుంది ? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి ? వంటి అన్ని వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ AP సహకార బ్యాంకులో ఉద్యోగాలు – Click here
Table of Contents :
🔥 PGCIL నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
🔥 PGCIL భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ ఇంజనీర్ మరియు ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 PGCIL భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం అన్ని విభాగాలలో కలిపి 1543 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో
- ఫీల్డ్ ఇంజనీర్ ( ఎలక్ట్రికల్ ) – 532
- ఫీల్డ్ ఇంజనీర్ ( సివిల్ ) – 198
- ఫీల్డ్ సూపర్వైజర్ ( ఎలక్ట్రికల్ ) – 535
- ఫీల్డ్ సూపర్వైజర్ ( సివిల్ ) – 193
- ఫీల్డ్ సూపర్వైజర్ ( ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ) – 85
🔥 PGCIL ఉద్యోగాలకు అవసరమగు వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 29 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి.
- వయసు నిర్ధారణ కొరకు 17/09/2025 ను కట్ ఆఫ్ తేదీ గా పరిగణిస్తారు.
- ఓ బి సి. ( నాన్ క్రిమిలేయర్ ) అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులకు పది సంవత్సరాలు వయోసడలింపు లభిస్తుంది.
🔥 విద్యార్హత :
1.ఫీల్డ్ ఇంజనీర్ : ఫీల్డ్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకుగాను 55% మార్కులతో సంబంధిత విభాగంలో బి . ఈ / బీటెక్ / బిఎస్సి (ఇంజనీరింగ్ ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి.
2. ఫీల్డ్ సూపర్వైజర్ : ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకుగాను సంబంధిత విభాగంలో డిప్లమో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. వీరికి కూడా సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం పని అనుభవం అవసరం.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకుగాను అవకాశం కల్పించారు.
🔥 దరఖాస్తు ఫీజు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకుగాను ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది.
- ఫీల్డ్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు 400 రూపాయలు , ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు 300 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది.
- ఎస్సీ , ఎస్టి , దివ్యాంగులు , ఎక్స్ సర్వీస్మెన్ వారికి ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పవర్ గ్రిడ్ కామన్ FTE రాత పరీక్ష – 2025 ను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- రాత పరీక్షలో భాగంగా టెక్నికల్ నాలెడ్జ్ పై 50 ప్రశ్నలు , ఆప్టిట్యూడ్ టెస్ట్ నుండి 25 ప్రశ్నలు ( జనరల్ ఇంగ్లీష్ & రీజనింగ్ & క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & జనరల్ ఎవేర్నెస్ ) వస్తాయి.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ కేటాయించారు. ఎటువంటి నెగటివ్ మార్కింగ్ విధానము లేదు.
🔥 పరీక్షా కేంద్రాలు :
- అభ్యర్థులు ఢిల్లీ , కలకత్తా , గౌహతి , భోపాల్ , బెంగళూరు , ముంబై నగరాలలో ఏదో ఒక దాన్ని పరీక్షా కేంద్రం కొరకు ఎంపిక చేసుకోవచ్చు.
🔥 జీతభత్యాలు :
- ఫీల్డ్ ఇంజనీర్ ఉద్యోగులుగా ఎంపికైన వారికి సంవత్సరానికి ₹8,90,000 రూపాయల వరకు జీతభత్యాలు లభిస్తాయి.
- ఫీల్డ్ సూపర్వైజర్ గా ఎంపికైన వారికి సంవత్సరానికి 6,80,000 రూపాయల వరకు జీతభత్యాలు లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 27/08/2025
- ఆన్లైన్ ఉద్యోగం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 17/09/2025
- గరిష్ట వయస్సు నిర్ధారణ , విద్యార్హత , పని అనుభవం కొరకు కట్ ఆఫ్ తేదీ : 17/09/2025
👉 Click here for official website
