Telangana Outsourcing Jobs Recruitment 2025 : తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా నందు గల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసేందుకు గాను గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెన్స్ మిషన్ (TEAM ) నుండి 56 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఆఫ్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అనగా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ? ఉద్యోగుల సంఖ్య ఎంత ? అర్హత వివరాలు ? లభించే జీతం ? ఎంపిక విధానం ? వంటి ఇతర అన్ని అంశాల కొరకు ఆర్టికల్ ను చివరివరకు చదవగలరు.
✅ రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here
Table of Contents
🔥 Telangana outsourcing jobs recruitment notification released by the Organisation :
- యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం నందు గల తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెన్స్ మిషన్ (TEAM ) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయింది.
🔥 Telangana Outsourcing Jobs being filled:
- ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసేందుకు వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాల సంఖ్య 56
- ఈసీజీ టెక్నీషియన్ – 04
- ల్యాబ్ అటెండెంట్ – 07
- రిఫ్రాక్షనిస్ట్ / ఆప్టిషియన్ – 01
- రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ – 04
- ఓటి టెక్నీషియన్ – 04
- అనస్తీసియా టెక్నీషియన్ – 02
- గ్యాస్ ఆపరేటర్ – 04
- థియేటర్ అసిస్టెంట్ – 02
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 07
- ఆఫీస్ సబార్డినేట్ – 06
- రికార్డ్ అసిస్టెంట్ – 01
- కేటలాగర్ – 01
- సిటీ టెక్నీషియన్ – 04
- కార్పెంటర్ – 01
- ఎలక్ట్రీషియన్ – 03
- ప్లంబర్ – 02
- బెడ్ బ్యాంక్ టెక్నీషియన్ – 03
🔥 Age requirement for Telangana outsourcing jobs :
- అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు 18 సంవత్సరాల వయసు నిండి , 44 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
- ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయోసడలింపు లభిస్తుంది.
🔥 Qualifications required for Telangana outsourcing jobs being filled :
- ఈ ఉద్యోగాలకు సంబంధించి పోస్టులను అనుసరించి విద్యార్హత అవసరం ఉంటుంది.
- 10వ తరగతి , ఐటిఐ , ఇంటర్మీడియట్ , డిగ్రీ తో పాటుగా నోటిఫికేషన్లు ప్రస్తావించిన ఉద్యోగాలకు అనుసరించి కోర్సులు నందు ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ECG Technician – అర్హత :
సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్ (10+2) మరియు ECG టెక్నీషియన్ డిప్లోమా / లేదా బి.ఎస్సీ (సైన్స్ గ్రూప్‌తో) + న్యూరో టెక్నాలజీలో PG డిప్లోమా.
2. Lab Attendant – అర్హత
10వ తరగతి పాస్, మరియు ల్యాబ్ అటెండెంట్ సర్టిఫికేట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ లో మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ కోర్సు.
3. Refranctionist / Optician – అర్హత :
ఐసమ్మత సంస్థలో 2 సంవత్సరాల ట్రైనింగ్ తో రిఫ్రాక్షనిస్ట్ & ఆప్టిషియన్ కోర్సు పూర్తి చేసి సర్టిఫికేట్ పొందాలి.
4. Radiographic Technician – అర్హత :
CRA కోర్సు లేదా ఇంటర్మీడియట్ (సైన్స్ గ్రూప్) + ఇమేజింగ్ టెక్నాలజీలో PG డిప్లోమా.
5. O.T Technician – అర్హత :
ఓపరేషన్ థియేటర్ టెక్నీషియన్ డిప్లోమా మరియు TGPMB లో రిజిస్ట్రేషన్ ఉండాలి.
6. Anesthesia Technician – అర్హత :
ఇంటర్మీడియట్ (సైన్స్ గ్రూప్) + అనస్థేషియా టెక్నీషియన్ డిప్లోమా.
7. Gas Operator – అర్హత :
ప్రభుత్వ గుర్తింపు ఉన్న ట్రేడ్ లో ITI సర్టిఫికెట్.
8. Theatre Assistant – అర్హత :
10వ తరగతి పాస్, మరియు First Aid Training సర్టిఫికేట్ ఉండాలి.
9. Data Entry Operator – అర్హత :
డిగ్రీ + కంప్యూటర్ అప్లికేషన్ డిప్లోమా + టైపింగ్ స్పీడ్ (8000 key depressions/hour).
10. Office Subordinate – అర్హత :
10వ తరగతి పాస్.
11. Record Assistant – అర్హత :
మెడికల్ రికార్డ్ డిప్లోమా + అనుభవం + 10వ తరగతి పాస్.
12. Cataloguer – అర్హత :
లైబ్రరీ సైన్స్ లో సర్టిఫికేట్ కోర్సు.
13. C.T Technician – అర్హత :
ఇంటర్మీడియట్ (సైన్స్ గ్రూప్) + ఇమేజింగ్ టెక్నాలజీ డిప్లోమా / బి.ఎస్సీ / PG డిప్లోమా.
14. Carpenter – అర్హత :
ITI సర్టిఫికేట్ (ప్రభుత్వ గుర్తింపు ఉన్న ట్రేడ్ లో).
15. Electrician – అర్హత :
ఎలక్ట్రికల్ రైటింగ్ ఎగ్జామ్ పాస్ + కనీసం 5 ఏళ్ల అనుభవం.
16. Plumber – అర్హత :
ప్రభుత్వ గుర్తింపు ఉన్న ట్రేడ్ లో ITI సర్టిఫికేట్.
17. Blood Bank Technician – అర్హత :
బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ డిప్లోమా + TGPMB రిజిస్ట్రేషన్.
🔥 దరఖాస్తు చేయు విధానం :
- అభ్యర్థులు అధికారిక జిల్లా వెబ్సైట్ నుండి దరఖాస్తుల డౌన్లోడ్ చేసుకుని , సంబంధిత దరఖాస్తులను ఫిల్ చేసి , అవసరమగు ధ్రువపత్రాలను జత చేసి ” జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం నందు గల తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్స్ మిషన్ కార్యాలయంలో అందజేయాలి.
- దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ గా 02/09/2025 ను నిర్ణయించారు.
- దరఖాస్తులను వ్యక్తిగతంగా అభ్యర్థి సమర్పించాలి. పోస్ట్ ద్వారా ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తుల స్వీకరించబడవు.
🔥 దరఖాస్తు తో పాటు సమర్పించవలసిన ధ్రువపత్రాలు :
- విద్యార్హత సర్టిఫికెట్లు
- కుల ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువ పత్రం
- ఆధార్ కార్డ్
- నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్ కాపీలు
🔥 దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు దరఖాస్తు సమర్పించేందుకుగాను 50 రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది.
- దరఖాస్తు రుసుము నగదు రూపంలో మాత్రమే స్వీకరిస్తారు ఆన్లైన్ చెల్లింపులు లేవు.
🔥 ఎంపిక విధానం :
- ఉద్యోగానికి సంబంధించి వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 జీతభత్యాలు :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి వారు పోస్టులను అనుసరించి నెల వారీ జీతభత్యాలు లభిస్తాయి.
వేతన వివరాలు (ప్రతి నెలకు)
ECG Technician – రూ. 22,750
Lab Attendant – రూ. 15,600
Refractionist / Optician – రూ. 19,500
Radiographic Technician – రూ. 19,500
O.T Technician – రూ. 19,500
Anesthesia Technician – రూ. 22,750
Gas Operator – రూ. 19,500
Theatre Assistant – రూ. 15,600
Data Entry Operator – రూ. 19,500
Office Subordinate – రూ. 15,600
Record Assistant – రూ. 19,500
Catalogueur – రూ. 19,500
C.T. Technician – రూ. 22,750
Carpenter – రూ. 19,500
Electrician – రూ. 19,500
Plumber – రూ. 19,500
Blood Bank Technician – రూ. 19,500
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆఫ్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 25/08/2025
- ఆఫ్‌లైన్ విధాన ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 02/09/2025 ( సాయంత్రం 05:00 గంటల లోగా)
👉 Click here for official website