AP District Court Jobs Vacancies Increase / Decrease Latest Update : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా 18-08-2025 తేదిన విడుదల చేసిన ROC.72/2025-RC ప్రకారం కొన్ని జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాల సంఖ్య తగ్గించడం లేదా పెంచడం జరిగింది. పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
06-05-2025 తేదిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ No.01/2025 నుండి 10/2025 వరకు విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్ (లైట్ వెహికల్), రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
✅ ఇంటర్ అర్హతతో 1121 ఉద్యోగాలు – Click here
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఆగస్టు 20 నుండి 24వ తేదీ మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలను ఈ ఉద్యోగాల ఎంపికలో నిర్వహిస్తున్నారు.
వివిధ తీర్పులు మరియు కారుణ్య నియామకాలు కారణంగా నోటిఫికేషన్ లో తెలిపిన పోస్టుల సంఖ్యలో తగ్గింపు లేదా పెంచడం జరిగింది. అనంతపురం , చిత్తూరు, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మరియు విశాఖపట్నం జిల్లాల్లో పోస్టుల సంఖ్యలో మార్పులు చేశారు.
గతంలో విడుదల చేసిన పది నోటిఫికేషన్స్ తెలిపిన విధంగానే Note.1 క్యాప్షన్ లో తెలిపిన విధంగానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోస్టుల సంఖ్య పెంచే అధికారం లేదా తగ్గించే అధికారం లేదా నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం ఉంటుంది.
తాజాగా ఏడు జిల్లాల్లో పోస్టుల సంఖ్యలో మార్పులు జరిగాయి.. కొన్ని జిల్లాల్లో పోస్ట్లు తగ్గాయి. కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య పెరిగింది. జిల్లాల వారీగా ఏ ఉద్యోగాలు పోస్టుల సంఖ్య తగ్గించారు ? ఏ పోస్టులు పెంచారు ? రిజర్వేషన్ల వారీగా వివరాలు తెలుసుకునేందుకు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పిడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఒకసారి చూడండి.
✅ ఏ జిల్లాలో పోస్టులు పెంచారు ? తగ్గించారు ? వివరాలతో వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here