LIC AAO (specialist) & AE (Civil & Mech) Notification 2025 : ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సంస్థ నుండి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO – స్పెషలిస్ట్) మరియు అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్ & ఎలక్ట్రికల్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 491 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అసిస్టెంట్ఈ ఇంజనీర్ ఉద్యోగాలు 81 కాగా , అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ( స్పెషలిస్ట్ ) ఉద్యోగాలు 410 , ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి సమగ్ర సమాచారం అనగా ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు ? దరఖాస్తు విధానం ఏమిటి? అర్హత వయస్సు ఎంత ? ఈ ఉద్యోగాలను పొందితే ఎంత జీతం వస్తుంది ? ఎంపిక విధానం ఏమిటి? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
✅ డిగ్రీ అర్హతతో LIC లో ఉద్యోగాలు – Click here
Table of Contents
🔥LIC AAO (Specialist) & AE (Civil & Mech) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఈ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO – స్పెషలిస్ట్ ) మరియు అసిస్టెంట్ ఇంజనీర్ ( సివిల్ & ఎలక్ట్రికల్ ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే LIC AAO (స్పెషలిస్ట్ ) & AE ( సివిల్ & ఎలక్ట్రికల్ ) సంఖ్య :
- దేశవ్యాప్తంగా మొత్తం 491 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO – స్పెషలిస్ట్ ) మరియు అసిస్టెంట్ ఇంజనీర్ ( AE – సివిల్ & ఎలక్ట్రికల్ ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్ – సివిల్ (AE – సివిల్) ఉద్యోగాలు – 50
- ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్ – ఎలక్ట్రికల్ (AE – ఎలక్ట్రికల్) ఉద్యోగాలు – 31
- AAO ( స్పెషలిస్ట్ ) : 410
- AAO ( CA ) – 30
- AAO ( CS ) – 10
- AAO ( Actuarial ) – 30
- AAO ( insurance specilist ) – 310
- AAO ( legal ) – 30
🔥 విద్యార్హత :
- అసిస్టెంట్ ఇంజనీర్ ( సివిల్ ) : గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుండి సివిల్ విభాగం బీటెక్ లేదా బి. ఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
- అసిస్టెంట్ ఇంజనీర్ ( ఎలక్ట్రికల్ ) : గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ విభాగం లో బీటెక్ లేదా బి. ఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO – స్పెషలిస్ట్ ) : స్పెషలిస్ట్ విభాగంలో ఉద్యోగాలకు క్రింది విద్యార్హత లు కలిగి వుండాలి.

🔥 AAO (స్పెషలిస్ట్ ) & AE ( సివిల్ & ఎలక్ట్రికల్ ) అవసరమగు వయస్సు :
- AAO ( లీగల్) & AAO ( చార్టెడ్ అకౌంటెంట్) ఉద్యోగాలకు 21 సంవత్సరాలు నిండి యుండి 32 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- నోటిఫికేషన్ లో ప్రస్తావించిన మిగతా అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థులకు కనీసం 21 సంవత్సరాలు నిండి యుండి 30 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి.
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 5 సంవత్సరాలు వయోసడలింపు కలదు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/08/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
🔥AAO (స్పెషలిస్ట్ ) & AE ( సివిల్ & ఎలక్ట్రికల్ ) ఉద్యోగాలకు దరఖాస్తు చేయు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ఏ పద్ధతుల్లోనూ దరఖాస్తు చేసుకునేందుకుగాను ఆకాశం కల్పించడం లేదు.
- దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారు ఆగస్టు 16వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 AAO (స్పెషలిస్ట్ ) & AE ( సివిల్ & ఎలక్ట్రికల్ ) ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టి , దివ్యాంగ అభ్యర్థులు 85 రూపాయల ఇంటిమేషన్ ఫీజును చెల్లించాలి..
- ఇతర అందరు అభ్యర్థులు 700 రూపాయలు అప్లికేషన్ ఫీజు మరియు ఇంటిమేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు అదనంగా ట్రాన్జక్షన్ చార్జెస్ మరియు జిఎస్టి ను భరించాల్సి ఉంటుంది.
🔥 AAO (స్పెషలిస్ట్ ) & AE ( సివిల్ & ఎలక్ట్రికల్ ) ఉద్యోగాలకు ఎంపిక విధానం :
- AAO (స్పెషలిస్ట్ ) & AE ( సివిల్ & ఎలక్ట్రికల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మూడు అంచెల విధానం ( ప్రిలిమినరీ పరీక్ష , మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ) ద్వారా ఎంపిక చేస్తారు. అలానే ప్రీ – రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహిస్తారు.
🔥 జీతభత్యాలు :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు 88635 /- రూపాయల బేసిక్ పే తో పాటుగా అన్ని అలవెన్సులు లభిస్తాయి.
- వీరికి ప్రారంభ జీతం గా 1,26,000 /- రూపాయలు లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 16/08/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 16/08/2025
- ఆన్లైన్ ఎగ్జామినేషన్ కొరకు కాల్ లెటర్లు డౌన్లోడ్ చేయుట : పరీక్షకు ఏడు రోజులు ముందు
- ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణ ( తాత్కాలికం) : 03/10/2025
- మెయిన్స్ రాత పరీక్ష నిర్వహణ ( తాత్కాలికం) : 08/11/2025
👉 Click here for Official Notification