Intelligence Bureau Security Assistant Recruitment 2025 | IB Security Assistant Qualification, Age, Salary, Selection Process

Intelligence Bureau Security Assistant Recruitment 2025 Details
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Intelligence Bureau Security Assistant Recruitment 2025 Details : భారత ప్రభుత్వం , హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలో గల ఇంటెలిజెన్స్ బ్యూరో ( IB) సంస్థ నుండి సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్ (SA/Exe) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4987 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా 53 ఉద్యోగాలను మరియు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా 63 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

✅ డిగ్రీ అర్హతతో దేవాదాయ శాఖలో ఉద్యోగాలు – Click here

ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు? అవసరమగు విద్యార్హతలు ఏమిటి? ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి ఎంత జీతం లభిస్తుంది ? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 Intelligence Bureau Security Assistant నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • మినిస్ట్రీస్ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో గల ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥Intelligence Bureau భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఇవి జనరల్ సెంట్రల్ సర్వీస్ ( గ్రూప్ – సి) , నాన్ గెజిటెడ్ , నాన్ మినిస్ట్రీరియల్ ఉద్యోగాలు.

🔥ఖాళీల సంఖ్య :

  • దేశ వ్యాప్తంగా మొత్తం 4987 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • తెలుగు రాష్ట్రాలలో విజయవాడ కేంద్రంగా 53 ఉద్యోగాలను & హైదరాబాద్ కేంద్రంగా 63 ఉద్యోగాలను మొత్తం 116 ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.

🔥విద్యార్హతలు :

  • ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
  • ఏ రాష్ట్రం పరిధిలోగల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారో ఆ రాష్ట్రంలో నివాస ధృవీకరణ పత్రం కలిగి వుండాలి.
  • సంబంధిత రాష్ట్ర భాష వచ్చి వుండాలి.

🔥వయోపరిమితి :

  • 18 సంవత్సరాలు నిండి యుండి 27 సంవత్సరాలు లోపు వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 17/08/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు కలదు.

🔥ఎంపిక విధానం :

  • టైర్ – 1 ( ఆబ్జెక్టివ్ వ్రాత పరీక్ష ) , టైర్ – 2 ( డిస్క్రిప్టివ్ వ్రాత పరీక్ష ) మరియు ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • మొత్తం 200 మార్కులకు గాను ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

🔥వ్రాత పరీక్ష కేంద్రాలు :

  • టైర్ – 01 వ్రాత పరీక్ష కి దేశంలో గల ప్రముఖ నగరాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్, గుంటూరు , కడప , కాకినాడ , కర్నూలు , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , విజయవాడ , విశాఖ పట్నం , విజయనగరం లలో పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ / సికింద్రాబాద్ , కరీం నగర్ , ఖమ్మం , మహబూబ్ నగర్ , వరంగల్ లలో పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.

🔥 జీతభత్యాలు :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి లెవెల్ – 03 బేసిస్ pay 21,700 రూపాయలు మరియు ఇతర అలవెన్సులు కలిపి మొత్తం 45,000 రూపాయల వరకు ప్రారంభ జీతం లభించవచ్చు.

🔥ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 26/07/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 17/08/2025
  • ఆఫ్లైన్ విధానం లో బ్యాంకు ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 19/08/2025 ( బ్యాంకు యొక్క పని వేళలలో)

👉 Click here to apply ( link – 1)

👉 Click here to apply ( link – 2 )

👉 Click here for official notification

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *