ముంబై ప్రధాన కేంద్రంగా గల లీడింగ్ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ది న్యూ ఇండియా ఎస్యురెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) నుండి 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరలిస్ట్స్& స్పెషలిస్ట్స్ ) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ కి అవసరం అగు అర్హతలు ఏమిటి ? ఎంత వయస్సు లోపు గలవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ? దరఖాస్తు చేయు విధానం ఏమటి ? అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఏ విధంగా ఎంపిక చేస్తారు ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥NIACL AO ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) సంస్థ నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥భర్తీ చేయబోయే మొత్తం ఖాళీల సంఖ్య :
- అన్ని విభాగాలలో కలిపి మొత్తం 550 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
✅ AP దేవాదాయ శాఖలో డిగ్రీ అర్హత తో ఉద్యోగాలు – Click here
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ( జనరలిస్ట్స్& స్పెషలిస్ట్స్ ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా
- రిస్క్ ఇంజనీర్స్ – 50
- ఆటోమొబైల్ ఇంజనీర్స్ – 75
- లీగల్ స్పెషలిస్ట్స్ – 50
- అకౌంట్స్ స్పెషలిస్ట్స్ – 20
- ఏవో ( హెల్త్) – 50
- ఐటి స్పెషలిస్ట్ – 25
- బిజినెస్ ఎనలైట్స్ – 75
- కంపెనీ సెక్రటరీ -02
- యాక్చురియల్ స్పెషలిస్ట్స్ – 05
- జనరలిస్ట్స్ – 193
🔥 NIACL AO ఉద్యోగాల విద్యార్హతలు :
- జనరలిస్ట్స్ : జనరలిస్ట్స్ విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నా ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఎస్సీ / ఎస్టి / దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు తో ఉత్తీర్ణత సాధించాలి.
- స్పెషలిస్ట్స్ : స్పెషలిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి క్రింది విద్యార్హత కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకుగాను అవకాశం కల్పించారు. అవి :


విద్యార్హతలకు సంబంధించి ఫలితాలు 01/08/2025 లోగా వచ్చి వుండాలి.
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 21 సంవత్సరాల నుండ 30 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు .
- వయస్సు నిర్ధారణ కొరకు 01/08/2025 ను కట్ ఆఫ్ తేదీగా పరిగణించారు.
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్మెన్ వారికి ఐదు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు చేయు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ఏదైనా ఒక విభాగంలో గల ఉద్యోగాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ విభాగాలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోరాదు.
🔥 ఎంపిక విధానం :
- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ , మెయిన్స్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ప్రిలిమినరీ వ్రాత పరీక్ష : ప్రిలిమినరీ వ్రాత పరీక్ష వంద మార్కులు గాను నిర్వహిస్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 30 ప్రశ్నలకు 30 మార్కులు , రీజనింగ్ ఎబిలిటీ 35 పశ్నలకు 35 మార్కులు , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలకు 35 మార్కులు కేటాయించారు. అయితే ఒక్కొక్క విభాగానికి 20 నిముషాలు సమయం , మొత్తం పరీక్ష కు ఒక గంట సమయం కేటాయించారు.
- మెయిన్స్ ఎగ్జామినేషన్: మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఆబ్జెక్టివ్ పరీక్షతో పాటుగా డిస్క్రిప్టివ్ పరీక్ష కూడా నిర్వహిస్తారు.
- మెయిన్స్ పరీక్ష (ఆబ్జెక్టివ్ )200 మార్కులకు గాను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రీజనింగ్ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ , జనరల్ అవేర్నెస్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలు ఉంటాయి. స్పెషలిస్ట్స్ వారికి సంబంధిత స్పెషలైజేషన్ ప్రశ్నలు కూడా పరీక్ష లో ఇస్తారు.
- మెయిన్స్ పరీక్షలో భాగంగా డిస్క్రిప్టివ్ పరీక్ష ను 30 మార్కులకు 30 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి లెటర్ రైటింగ్ కి 10 మార్కులు & ఎస్సే రైటింగ్ కి 20 మార్కులు కేటాయించారు.
- మెయిన్స్ పరీక్ష నిర్వహించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షలలో తప్పుగా సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 1/4 వంతు నేటి మార్కింగ్ విధానం కలదు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టి , దివ్యాంగులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- ఇతర అభ్యర్థులు 850 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
🔥పరీక్షా కేంద్రాలు :
- దేశంలోని అన్ని రాష్ట్రాలలో గల ప్రముఖ నగరాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు / విజయవాడ , కాకినాడ , కర్నూలు , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , విశాఖపట్నం , విజయనగరం , అనంతపూర్ , కడప లోనూ… తెలంగాణ లోని హైదరాబాద్ , కరీంనగర్ , ఖమ్మం , వరంగల్ , నిజామాబాద్ లో ప్రిలిమినరీ వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.
- మెయిన్స్ వ్రాత పరీక్ష ను ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ / గుంటూరు, విశాఖపట్నం లో తెలంగాణ లోని హైదరాబాద్ లో నిర్వహిస్తారు.
🔥 జీత భత్యాలు:
- ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి 50,925 రూపాయల బేసిక్ పే తో అన్ని అలవెన్స్ లు కలిపి 90,000 రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు పేమెంట్ చేయడానికి ప్రారంభ తేదీ : 07/08/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు పేమెంట్ చేయడానికి చివరి తేదీ : 30/08/2025
- ఫేజ్ – 01 ఆన్లైన్ పరీక్ష నిర్వహణ ( ఆబ్జెక్టివ్) : 14/09/2025
- ఫేజ్ – 02 ఆన్లైన్ పరీక్ష నిర్వహణ ( ఆబ్జెక్టివ్ & డిస్క్రిప్టివ్ ) : 29/10/2025
👉 Click here for official website