భారత నావికాదళం నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ గా నియామకం చేసేందుకు గాను వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ (Indian Navy SSC Officer’s Notification 2025) విడుదలైంది.
అవివాహిత పురుషులు మరియు అవివాహిత మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు. ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో ఆగస్టు 9 , 2025 నుండి సెప్టెంబర్ ఒకటి 2025 వరకు దరఖాస్తు చేసుకునేందుకుగాను అవకాశం కల్పించారు.
ఇండియన్ నేవీ సంస్థ జూన్ 2026వ సంవత్సరంలో నిర్వహించే ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సుకు గాను ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే , ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
Table of Contents :
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఇండియన్ నేవీ సంస్థ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది
🔥భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :
- అన్ని విభాగాలలో కలిపి మొత్తం 260 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగ విభాగాలు :
- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (హైడ్రో కేడర్)
- పైలెట్
- నావెల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్
- లాజిస్టిక్స్
- నావెల్ కన్స్ట్రక్టర్
- లా
- ఎడ్యుకేషన్
- ఎలెక్ట్రికల్
- నావెల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్
🔥విద్యార్హత :
- సంబంధిత విభాగంలో డిగ్రీ , బి.టెక్ , బి.ఈ , ఏం.ఎస్సీ , ఏం.బి.ఎ , ఎం.ఎస్సీ వంటి విద్యార్హతలు కలిగి వుండాలి.
🔥వయస్సు :
- అత్యధిక పోస్టులకు జూలై 02 , 2001 నుండి జనవరి 01 , 2007 లోపు జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- కొన్ని పోస్టులకు జూలై 02 , 2001 నుండి జూలై 01 2005 లోపు జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇతర కొన్ని పోస్టులకు 1999 నుండి 2005 లోపు జన్మించిన వారు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉంది.

🔥దరఖాస్తు చేయు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపికా విధానం :
- అభ్యర్థులను వారి యొక్క విద్యార్హత మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- ఆ తర్వాత SSB ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక పూర్తి చేస్తారు.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి సాధారణంగా ప్రారంభ జీతం గా 1,10,000/- రూపాయలు లభిస్తుంది.
🔥ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 09 ఆగస్టు 2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 01 సెప్టెంబర్ 2025
👉 Click here for official website
👉 Click here for official notification