SBI JA Notification 2025 in Telugu | SBI Clerk Notification 2025

SBI JA Notification 2025 Syllabus
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

నిరుద్యోగులకు శుభవార్త ! ముంబై ప్రధాన కేంద్రంగా గల పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సంస్థ నుండి జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) (SBI JA Notification 2025 in Telugu) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ ఉద్యోగాలను ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కలిపి మొత్తం 6589 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లో 310 ఉద్యోగాలను మరియు తెలంగాణ లో 250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తం 560 ఉద్యోగాల భర్తీ అన్నది బ్యాంకింగ్ అభ్యర్థులకు కి శుభపరిణామం.

అయితే అభ్యర్థులు తమ సొంత రాష్ట్రం లోనే అప్లై చేసుకోవలసిన అవసరం లేదు , వారికి ఇష్టం వచ్చిన రాష్ట్ర పరిధిలో దరఖాస్తు చేసుకోవచ్చు , అయితే వారికి ఆ రాష్ట్ర స్థానిక భాష వచ్చి వుండాలి. సాధారణంగా తెలుగు రాష్ట్ర బ్యాంకింగ్ అభ్యర్థులు తెలుగు రాష్ట్రాలలో లేదా ఖాళీల సంఖ్య ఆధారంగా కట్ ఆఫ్ తక్కువగా ఉండే ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ ఉంటారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 సంవత్సరానికి గాను విడుదల చేసిన జూనియర్ అసోసియేట్స్ ( కస్టమర్ సపోర్ట్ & సేల్స్ ) నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనగా నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదివి తెలుసుకోగలరు.

డ✅ ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ అర్హతతో 35,000/- జీతం వచ్చే ఉద్యోగాలు – Click here

Download Our APP – Click here

🔥 SBI JA Notification 2025 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) సంస్థ దేశ వ్యాప్తంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.

🔥 SBI JA Notification 2025 ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) అనే క్లేరికల్ కేడర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 SBI JA Notification 2025 Total Vacancies :

  • దేశ వ్యాప్తం గా మొత్తం 6589 ఉద్యోగాల ను భర్తీ చేస్తూ ఉండగా , తెలుగు రాష్ట్రాల లో ఉద్యోగ ఖాళీల సంఖ్య ఈ విధంగా వుంది.
  • ఆంధ్రప్రదేశ్ – 310 & తెలంగాణ – 250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఖాళీలు కేటగిరీ వారీగా విభజించబడ్డాయి

🔥 SBI JA Notification 2025 Qualification Details :

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
  • విద్యార్హత నిర్ధారణ కొరకు 31/12/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
  • ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిగ్రీ / గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం అభ్యసిస్తున్న వారు కూడా అర్హులే. అయితే వీరు 31/12/2025 లోగా వారి విద్యార్హత సర్టిఫికెట్ కలిగి వుండాలి .

🔥 SBI JA Notification 2025 Age Details :

  • అర్హత గల అభ్యర్థులు వయస్సు 20 సంవత్సరాలు నిండి వుండి 28 సంవత్సరాలలోపు గా వుండాలి.
  • ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు , ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు , PWBD వారికి 10 సంవత్సరాలు , Ex – సర్వీస్ మాన్ వారికి 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/04/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥How to Apply SBI JA Notification 2025 :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • జనరల్ , EWS , OBC అభ్యర్థులు 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ , ఎస్టీ , PwBD , ఎక్స్ సర్విస్ మెన్ అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. వీరికి ఫీజు నుండి మినహాయింపు కలదు.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష (ప్రిలిమినరీ & మెయిన్స్ ) నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులకు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర స్థానిక భాష వచ్చి వుండాలి , స్థానిక భాష నైపుణ్యత ను కూడా పరిశీలించి ( లాంగ్వేజ్ ప్రోఫిసియన్సీ టెస్ట్ ) నియామకం చేస్తారు.

🔥 ఆన్లైన్ పరీక్షా విధానం :

  • ప్రిలిమినరీ పరీక్షలో భాగంగా మొత్తం 100 మార్కులకు గాను , 100 ప్రశ్నలు ఇస్తారు ,ఇవి బహులైచ్చిక ప్రశ్నలు ఇందులో రీజనింగ్ ఎబిలిటీ , న్యూమరికల్ ఎబిలిటీ ,ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వుంటాయి. 60 నిముషాలు కేటాయించారు. సెక్షన్ వారీగా సమయం , మార్కులు ,ప్రశ్నలు నిర్ధారిస్తారు.
  • మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు గాను 190 ప్రశ్నలు ఉంటాయి. ఫైనాన్షియల్ అవేర్నెస్ / జనరల్ అవేర్నెస్ , జనరల్ ఇంగ్లిష్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ , రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు ఉంటాయి.
  • ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలో ప్రతీ తప్పు సమాధానానికి కి ¼ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.

🔥 పరీక్ష కేంద్రాలు :

  • దేశంలోని పలు ప్రముఖ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా పలు నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు
  • .ఆంధ్ర ప్రదేశ్ :అనంతపూర్ , గుంటూరు/ విజయవాడ , కడప , కాకినాడ , కర్నూల్ , నెల్లూరు , రాజమండ్రి , శ్రీకాకుళం , తిరుపతి , విశాఖపట్నం , విజయనగరం కేంద్రాలను ఎంపిక చేశారు.
  • తెలంగాణ : హైదరాబాద్ , ఖమ్మం , వరంగల్ , కరీంనగర్ కేంద్రాలను ఎంపిక చేశారు.

🔥 జీతం :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 30 వేల వరకు ప్రారంభ వేతనం లభిస్తుంది.
  • వారికి వివిధ రకాల అలవెన్సులు లభిస్తాయి.

🔥 ప్రొబేషన్ పీరియడ్:

  • ఎంపిక కాబడిన అభ్యర్థులు 6 నెలలు పాటు ప్రొబెషన్ పీరియడ్ లో వుంటారు.

🔥 సర్వీస్ బాండ్:

  • ఎంపిక కాబడిన అభ్యర్థులు 3 సంవత్సరాలు బ్యాంక్ వారి సర్వీస్ లో పనిచేసే విధంగా 2 లక్షల రూపాయలకు బాండ్ కి కట్టుబడి వుండాలి

🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 06/08/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 26/08/2025
  • ప్రిలిమినరీ వ్రాత పరీక్ష సెప్టెంబర్ 2025 లో నిర్వహిస్తారు.
  • మెయిన్స్ వ్రాత పరీక్ష ను నవంబర్ 2025 లో నిర్వహిస్తారు.

👉 Click here for notification

👉 Click here to apply

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!