AP Mega DSC Results 2025 Latest News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్లో భాగంగా 16 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఎప్పటికీ మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన డీఎస్సీ బోర్డు వారు, ఇటీవలే ఫైనల్ కీ కూడా విడుదల చేశారు. ఆగస్టు 15 వ తేదీ లోగా తుది ఫలితాలను విడుదల చేసి , ఆగస్టు నెలాఖరు నాటికి పోస్టింగ్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.
Table of Contents
🏹 డిగ్రీ అర్హతతో 10,277 ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
🔥ఆగస్టు 15 నాటికి మెగా DSC ఫలితాలు (AP Mega DSC results by August 15)
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.
- ఇటీవల ఫైనల్ కీ విడుదల అవ్వగా, ఆగస్టు 15 నాటికి ఫలితాలను విడుదల చేయాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.
- ఆగస్టు 16 నుండి ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది.
- స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న 421 ఉద్యోగాలకు సంబంధించి వివరాలు అందిన వెంటనే జిల్లాల వారీగా కట్ ఆఫ్ మార్కులు ప్రకటిస్తారు.
- స్పోర్ట్స్ కోటాకు సంబంధించి శాప్ నుండి వివరాలు అందేలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
🔥ఆగస్టు నెలాఖరు నాటికి పోస్టింగ్ & శని , ఆదివారాల్లో నూతన ఉపాధ్యాయులకు శిక్షణ:
- ఆగస్టు 15 లోపుగా ఫలితాలు విడుదల చేసి, జిల్లాల వారీగా కట్ ఆఫ్ మార్గాలన విడుదల చేసిన తర్వాత విద్యాశాఖ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
- ఆగస్టు నెల చివరకు ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి పోస్టింగ్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కృత నిశ్చయంతో ఉంది.
- అయితే ఇప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో , టీచర్ పోస్టులకు ఎంపిక అయిన వారికి గతంలో వలె కాకుండా పోస్టింగ్ ఇచ్చాక శిక్షణ ఇస్తారు.
- శని ఆదివారాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
- ఇవన్నీ పూర్తి అయితే సెప్టెంబర్ మొదటి వారంలో ఉపాధ్యాయులు పాఠశాలలలో జాయిన్ అయ్యి పాఠాలు చెప్పనున్నారు.
✅ Official Website – Click here