JNV 6th Class Admission Apply Last Date Extended | Jawahar Navodaya vidyalaya 6th Class Admission

JNV 6th Class Entrance Exam 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

దేశవ్యాప్తంగా ఉన్న 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన వారికి ఆరవ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తారు. ఇక్కడ సీటు పొందిన విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు సన్నద్ధమయ్యేలా శిక్షణ ఇస్తారు.

ఈ నోటిఫికేషన్ జూన్ 1వ తేదీన విడుదల చేశారు. జూలై 29 వరకు అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. తాజాగా అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్టు 13 వరకు పొడిగించారు. అర్హత ఉన్న విద్యార్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

AP లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ, ప్రత్యేకతలు ఇవే – Click here

JNV 6th Class Entrance Exam Procedure :

  • జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను విద్యార్థులు తమకు నచ్చిన భాషలో అనగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు ఇతర భాషల్లో రాసుకోవచ్చు.
  • ఈ పరీక్షలో 80 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వంద మార్కులకు గాను ఇస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుంది.
  • ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు.
  • విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఉపయోగించి సరైన ఆప్షన్ ఉండే సర్కిల్ దిద్దాలి.

JNV’s in Andhra Pradesh and Telangana :

  • దేశవ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్ లో 15 తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.
  • ఒక్కో విద్యాసంస్థలో గరిష్టంగా 80 మంది వరకు విద్యార్థులకు ఆరువ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు.

Who is Eligible For JNV 6th Class Admission ?

  • విద్యార్థులు ప్రవేశాలు కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతూ ఉండాలి.
  • మొత్తం 100% సీట్లలో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయిస్తారు. 25% సీట్లకు ఎవరైనా పోటీపడి అవకాశం ఉంటుంది.
  • గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం కేటాయించిన 75% సీట్లలో ప్రవేశాలు పొందాలి అంటే మూడు, నాలుగు, ఐదు తరగతులలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చదివి ఉండాలి.
  • ఉన్న సీట్లలో మూడో వంతు సీట్లు బాలికల కోసం కేటాయిస్తారు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% , ఓబీసీలకు 27% , PWD విద్యార్థులకు కూడా సీట్లు కేటాయిస్తారు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *