BSF Head constable recruitment 2023 | telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంస్థ నుండి హెడ్ కానిస్టేబుల్( రేడియో ఆపరేటర్/ రేడియో మెకానిక్) పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 247 పోస్టుల వున్నాయి. ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ విధానం లో అప్లై చేసుకోవాలి. అర్హత కలిగిన పురుషులు,మహిళలు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు: అప్లై చేసుకోవడానికి

ప్రారంభ తేదీ:22 ఏప్రిల్ 2023(రాత్రి 11:00 గంటల నుండి)

ముగింపు తేదీ:12 మే 2023(రాత్రి 11:59గంటల వరకు)

ఫిజిక్స్, మ్యాథ్మాటిక్స్& కెమిస్ట్రీ సబ్జెక్ట్ లు కలిగివున్న ఇంటర్మీడియేట్ పూర్తి చేసి వుండాలి.

పదవ తరగతి పూర్తి చేసి,రేడియో & టెలివిజన్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా డాటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ లేదా జనరల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ లలో ఇటీఐ పూర్తి చేసిన వారు కూడా అర్హులే.

హెడ్ కానిస్టేబుల్ ( రేడియో మెకానిక్): lమ్యాథ్మాటిక్స్ & కెమిస్ట్రీ సబ్జెక్ట్ లు కలిగివున్న ఇంటర్మీడియేట్ పూర్తి చేసి వుండాలి,

ఫిజిక్స్,మ్యాథ్మాటిక్స్ & కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి.

(లేదా)

పదవ తరగతి పూర్తి చేసి,రేడియో & టెలివిజన్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా డాటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్  లేదా జనరల్ ఎలక్ట్రానిక్స్ లేదా ఫిట్టర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మైంటైనెన్స్ లేదా కంప్యూటర్ హార్డ్వేర్ లేదా నెట్వర్క్ టెక్నీషియన్ లేదా మెకట్రోనిక్స్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ లలో ఐటీఐ చేసినవారు అర్హులు.

పోస్టుల వివరాలు: మొత్తం 247 పోస్ట్లు భర్తీ చేస్తున్నారు, కేటగిరీ వారీగా పోస్టుల విభజన జరిగింది.

వయస్సు:18 సంవత్సరాలు నిండి యుండి 25 సంవత్సరాల లోపుగల వారు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ/ఎస్టి వారికి 5 సంవత్సరాలు

OBC వారికి 3 సంవత్సరాలు

వయోపరిమితి వుంది.

సెలక్షన్ విధానం: మొత్తం మూడు ఫేజ్ లలో రిక్రూట్మెంట్ విధానం జరుగుతుంది.

మొదటి దశ: OMR ఆధారిత రాత పరీక్ష వుంటుంది. 100 ప్రశ్నలు ఇస్తారు,200 మార్కులకు గాను 2గంటల సమయం లభిస్తుంది.ఒక్కో ప్రశ్నకు 2మార్కులు కేటాయించారు.ప్రతి తప్పు ప్రశ్నకి 0.25 మార్కులు తొలగింపు వుంటుంది.

సిలబస్:

పార్ట్ అంశంప్రశ్నలుమార్కులు
పార్ట్ -1ఫిజిక్స్4080
పార్ట్ -2మ్యాథ్మాటిక్స్2040
పార్ట్ -3కెమిస్ట్రీ 2040
పార్ట్ -4ఇంగ్లీష్ & G.K2040
10+2 /ఇంటర్మీడియేట్ స్థాయి ప్రశ్నలు వుంటాయి.G.K విభాగంలో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ & జనరల్ సైన్స్ అంశాలు వుంటాయి.

శరీర దారుఢ్యం:

అంశంపురుషులుమహిళలు
ఎత్తు 168 c.m156 c.m
ఛాతి 80 c.m( ఎక్స్పానిషన్ తర్వాత 85 c.mవర్తించదు
బరువుఎత్తుకు సరిపడినంతఎత్తుకు సరిపడినంత

ఫిజికల్ ఎఫీసియాన్సీ టెస్ట్:

అంశంపురుషులుమహిళలు
పరుగు1.6 km 6 1/2 నిముషాలలో పూర్తి చేయాలి800 మీటర్లు ను 4 నిముషాలలో పూర్తి చేయాలి
లాంగ్ జంప్11అడుగులు( 3 అవకాశాలు ఇస్తారు)9 అడుగులు( 3 అవకాశాలు ఇస్తారు)
హై జంప్3 1/2 అడుగులు( 3 అవకాశాలు ఇస్తారు) 3 అడుగులు ( 3 అవకాశాలు ఇస్తారు)
ఎక్స్ – సర్వీస్ మెన్ వారికి ఫిజికల్ ఎఫీసియాన్సీ టెస్ట్ నుండి మినహాయింపు వుంటుంది.

జీతభత్యాలు:7th CPC ప్రకారం లెవెల్ -4 పేస్కేల్ అప్లై అవుతుంది.రూ.25,500-రూ.81,100/- శాలరీ లభిస్తుంది.అలానే మిగతా అలవెన్సులు అన్నీకుడా వస్తాయి.

అప్లై చేయు విధానం: అభ్యర్థి అర్హత ను బట్టి ఏదైనా ఒక పోస్ట్ కి లేదా రెండిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు.ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.

NOTIFICATION – CLICK HERE

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *