పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం (PM Kisan – Annadata Sukhibhava Status) నిధులు విడుదల తేదీ వచ్చేసింది… అర్హత గల రైతులు గత కొన్ని నెలలుగా ఈ పథకం డబ్బులు కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ పథకం డబ్బులు విడుదల తేది వెల్లడైంది.
PM Kisan 20th Installment Date 2025 :
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 20వ విడత డబ్బులను ప్రధాన మంత్రి నరేంద్ర మోది గారు ఈ నెల 18వ తేదిన బీహార్ లో జరిగే బహిరంగ సభలో విడుదల చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
19వ విడత నిధులను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి కలుగుతుంది.
✅ Join Our What’sApp Group – Click here
విడుదల కానున్న అన్నదాత సుఖీభవ పథకం నిధులు : (PM Kisan పథకం డబ్బుతో పాటే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ)
కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం డబ్బులు విడుదల అయిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. కాబట్టి పీఎం కిసాన్ పథకం 20వ విడత నిధులు 2,000/- చొప్పున రైతుల అకౌంట్లో జమ కాగానే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా 5,000/- చొప్పున రైతుల అకౌంట్లో జమ కానున్నాయి.
🏹 అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ ఇలా చూడండి – Click here