పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పై కీలక ప్రకటన చేసిన UIDAI | UIDAI Latest Guidelines

ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

యూనిక్ ఐడెంటిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) చిన్న పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కి సంబంధించి కీలక ప్రకటన చేసింది.

ఇటీవల ఈ సంస్థ ఆధార్ కి సంబంధించి పలు అప్డేట్స్ ను తెలియచేసింది. ఇందులో భాగంగా గోప్యతా దృశ్యా పూర్తి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక నుండి ఆధార్ లో చూపించబోదు అని, కానీ డేటాబేస్ లో స్టోర్ చేయబడి ఉంటుంది అని తెలిపారు. అలానే ఆధార్ సర్వీస్ లకు సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్లు అవసరం అనేది కూడా తెలియచేశారు.

ఇప్పుడు చిన్న పిల్లల ఆధార్ విషయమే కీలక ప్రకటన జారీ చేశారు. ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో UIDAI తాజా సూచనలు తప్పక పాటించాల్సిందే..

ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

ప్రతిరోజు వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం మీ మొబైల్ కి మేము ఉచితంగా పంపిస్తాము.. క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి నా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి…

Join Our What’sApp Group – Click here

🔥చిన్న పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాలి – UIDAI:

  • చిన్నారుల ఆధార్ కి సంబంధించి UIDAI ప్రకటన చేసింది.
  • అందరూ కూడా ఈ సూచనలు పాటించాలి అని తెలిపింది.
  • చిన్నారుల ఆధార్ అప్డేట్ అన్నది తప్పనిసరి అని , ఏడేళ్ల వయస్సు వచ్చినా కూడా పిల్లల బయోమెట్రిక్ , ఐరిష్ , ఫోటో వివరాలు అప్డేట్ చేయకపోతే ఆ ప్రక్రియ ను తక్షణమే పూర్తి చేయాలి అని తల్లిదండ్రులు మరియు సంరక్షకులు కి సూచనలు జారీ చేసింది.
  • ఐదు సంవత్సరాలు లోపు వారికి బయోమెట్రిక్ మరియు ఐరిష్ అవసరం లేకుండానే బాల ఆధార్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
  • 7 ఏళ్లు పూర్తి అయ్యే లోపు అప్డేట్ చేయక పోతే , ఆధార్ డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది.

🔥 మీ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఇలా చేయండి :

  • చిన్న పిల్లల తల్లిదండ్రులు మరియు సంరక్షకులు అందరూ వారి పిల్లలు కు mandatory biometric update (MBU) చేయాలి.
  • ఇందుకు మీకు దగ్గర లో గల ఆధార్ సెంటర్ ను సంప్రదించాలి.
  • పిల్లల ఆధార్ కార్డు , మరియు పిల్లల ను తీసుకొని వెళ్లి ఆధార్ ఆపరేటర్ & ఆధార్ సూపర్ వైజర్ ను సంప్రదించి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి.
  • 5 సంవత్సరాలు నుండి 7 సంవత్సరాలు లోపు పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేస్తే ఉచితంగా సర్వీసు వుంటుంది అని , 7 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అప్డేట్ చేయాలి అనుకుంటే 100 రూపాయలు సర్వీస్ ఛార్జ్ చెల్లించాలి.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!