ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నందు గల ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి అగ్రి సెట్ – 2025 (AP AGRICET 2025) నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
అగ్రికల్చర్ విభాగంలో B.Sc డిగ్రీ చేయాలి అనుకున్న వారు AGRICET ను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అగ్రిసెట్ పరీక్ష రాసేందుకు అర్హులు.
AP AGRICET – 2025 నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ Join Our Telegram Group – Click here
🔥AGRICET 2025 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు , లామ్ కేంద్రంగా గల ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి AGRICET – 2025 విడుదల అయ్యింది.
🔥AP AGRICET 2025 మొత్తం సీట్ల వివరాలు :
- మొత్తం 297 సీట్లు డిప్లొమా హోల్డర్స్ కి కేటాయించారు.
- అన్ని విభాగాలలో కలిపి యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజీ లో 196 సీట్లు కేటాయించారు.
- అన్ని విభాగాలలో ఎఫిలియేటెడ్ అగ్రికల్చర్ కాలేజీ లలో 101 కేటాయించారు.
🔥AP AGRICET 2025 కొరకు విద్యార్హత:
- అభ్యర్థులు ANGRAU అగ్రికల్చర్ , సీడ్ టెక్నాలజీ , ఆర్గానిక్ ఫార్మింగ్ లో 2 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
🔥వయస్సు :
- అభ్యర్థులకు 17 సంవత్సరాలు నిండి యుండి 22 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
- ఎస్సీ , ఎస్టి అభ్యర్థులకు 25 సంవత్సరాల వరకు మరియు దివ్యాంగులు కి 27 సంవత్సరాల వరకు అవకాశం కల్పించారు.
- వయస్సు నిర్ధారణ కొరకు 31/12 /2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
🔥 AP AGRICET దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్లైన్ విధానం ద్వారా రిజిస్టర్ అవ్వడానికి 11/07/2025 నుండి 26/07/2025 వరకు అవకాశం కల్పించారు.
- లేట్ ఫీ పే చేసి దరఖాస్తు చేసుకోవడానికి 27/07/2025 నుండి 29/07/2025 వరకు అవకాశం ఉంటుంది.
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తును రిజిస్టర్ పోస్ట్ / స్పీడ్ పోస్ట్ ద్వారా కార్యాలయ చిరునామాకు పంపించాలి.
🔥దరఖాస్తు తో పాటు జత పరచవలసిన ధ్రువపత్రాలు:
- అప్లికేషన్ ఫారం
- వయస్సు ధృవీకరణ కొరకు బర్త్ సర్టిఫికెట్ / SSC సర్టిఫికెట్
- SSC సర్టిఫికెట్
- డిప్లొమా కోర్సు యొక్క మార్క్స్ మెమొరాండం / కోర్సు కంప్లీషన్ సర్టిఫికెట్
- ఇటీవల కండక్ట్ సర్టిఫికెట్
- కుల దృవికరణ పత్రం
- స్టడీ/ రెసిడెన్స్ సర్టిఫికెట్
- PH, NCC, స్పోర్ట్స్ , CAP వంటి సర్టిఫికెట్ ఉంటే అవి
- సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి
- పేమెంట్ రిసిప్ట్
🔥AP AGRICET 2025 దరఖాస్తు పంపవలసిన చిరునామా:
The Convener, AGRICET-2025, O/o The Professor & Head, Department of Entomology, Agricultural College, Bapatla -522 101, A.P
- దరఖాస్తు ను 05/08/2025 లోగా పంపించాలి.
🔥AP AGRICET 2025 ఫీజు వివరాలు :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ మరియు దివ్యాంగులు 750/- రూపాయలు & మిగతా అందరు అభ్యర్థులు 1500/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
- లేట్ ఫీజు ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు వారు 1500/-రూపాయలు & జనరల్ అభ్యర్థులు 3,000/-రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
🔥AP AGRICET 2025 పరీక్షా వివరాలు :
- AGRICET – 2025 కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష , తెలుగు మరియు ఇంగ్లీష్ భాష లలో నిర్వహిస్తారు.
- 18/08/2025 న మధ్యాహ్నం 02:30 నుండి 04:00 గంటల వరకు జరుగుతుంది.
- మొత్తం 120 ప్రశ్నలకు గాను 90 నిముషాల కేటాయించారు.
- మొత్తం బహుళైచ్చక ప్రశ్నలు ( multiple choice questions) ఉంటాయి.ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.
- ANGRAU యొక్క డిప్లొమా సిలబస్ ఆధారిత ప్రశ్నలే పరీక్ష లో ఉంటాయి.
🔥AP AGRICET 2025 పరీక్షా కేంద్రాలు :
- రాష్ట్రం లో గల మొత్తం 13 జిల్లాలలో కూడా ఈ పరీక్ష నిర్వహిస్తారు.
🔥 AP AGRICET 2025 హెల్ప్ డెస్క్ వివరాలు :
- అగ్రిసెట్ – 2025 కి సంబంధించి టెక్నికల్ సమస్యలు , సందేహాల నివృత్తి కొరకు హెల్ప్ లైన్ టెక్నికల్ నెంబర్ : 9542460657 మరియు అధికారిక ఇమెయిల్ ఐడి : agricet.angrau@gmail.com ను సంప్రదించవచ్చు.
👉 Click here for official website