పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన (PM KMY Scheme) పథకం ద్వారా రైతుల అకౌంట్ లో ప్రతీ నెలా 3,000/- రూపాయలు

PM KMY Scheme

ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటాయి. రైతుల కోసం కూడా కొన్ని పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన (PM KMY Scheme) అనే కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులు ప్రతినెల 3 వేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు. వృద్ధులైన రైతుల అకౌంట్లో ప్రతినెల 3,000/- రూపాయలు చొప్పున పెన్షన్ అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన (PM KMY Scheme) పథకానికి ఎవరు అర్హులు ?

  • పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకానికి సన్న చిన్న కారు రైతులు అర్హులు.
  • వయస్సు 18 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • ఐదు ఎకరాల లోపు సొంత వ్యవసాయ భూమి ఉండాలి.

అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ చేసే తేది – Click here

పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన (PM KMY) పథకానికి ఎవరు అనర్హులు ? :

  • ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు, పన్ను చెల్లించేవారు, సామాజిక భద్రత పథకం పరిధిలో ఉండేవారు, ఆర్థికంగా బాగున్నవారు ఈ పథకానికి అనర్హులు.
  • నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), ESI, EPO పథకాల పరిధిలో ఉన్న వరు కూడా అనర్హులు.

పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన (PM KMY) పథకానికి ఎలా అప్లై చేయాలి ? :

  • ఈ పథకానికి పైన తెలిపిన అర్హతలు ఉన్నవారు కామన్ సర్వీస్ సెంటర్ (CSC) వద్దకు వెళ్లి అప్లై చేయవచ్చు.
  • అప్లై చేసే సమయంలో అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. (దరఖాస్తు ఫారం, ఆధార్, నామిని వివరాలు, రైతు సంతకం వంటి వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది)

పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన (PM KMY) పథకం ప్రీమియం వివరాలు :

  • ఈ పథకానికి అప్లై చేసుకున్న వారు వారి వయస్సు ఆధారంగా ప్రతి నెల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
  • 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు ప్రతి నెల 55 రూపాయలు నుండి 200 రూపాయల వరకు వారి వయస్సు ఆధారంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
  • ఉదాహరణకు 18 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు 55 రూపాయలు చొప్పున ప్రీమియం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తన వాటా క్రింద 55 రూపాయలు జత చేసి మొత్తం 110/- రూపాయలు నెలకు ఈ పథకంలో భీమా చెల్లిస్తుంది. ఇలా 60/- సంవత్సరాలు వరకు ప్రీమియం చెల్లించినట్లయితే 60/- సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతినెల 3,000/- రూపాయలు చొప్పున పెన్షన్ వస్తుంది. భీమా చెల్లించిన రైతు మరణించినట్లయితే రైతు భార్యకు ప్రతినెల 1,500/- రూపాయలు చొప్పున పెన్షన్ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!