ఏపీలో EAPCET కౌన్సిలింగ్ తేదీలు కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గా ఎదురు చూస్తున్నారు. AP EAPCET Counselling Dates పై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభించి ఆగస్ట్ నెలలో తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు త్వరలో తేదీలు ప్రకటించనున్నారు.
జూలై 9వ తేదీ నుండి ఈసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం :
డిప్లమో విద్యార్థులు బీటెక్ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ ప్రవేశ పరీక్ష రాశారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి జూలై 9వ తేదీ నుండి 22వ తేది వరకు మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. జూలై ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం తరగతిలో ప్రారంభమవుతాయి. జూలై 30వ తేదీ నుండి ఆగస్టు 4వ తేదీ వరకు రెండవ విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
AP EAPCET Counselling Total Seats :
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారి సంఖ్య భారీగా పెరిగింది. కాబట్టి అడ్మిషన్లు కూడా పెరుగుతాయి. ఈ సంవత్సరం EAPCET ఇంజనీరింగ్ విభాగంలో 1,89,748 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు రావడంతో సీట్ల సంఖ్య రెండు లక్షలకు పైగా ఉంటుంది. కాబట్టి ఉత్తీర్ణులైన అందరు తప్పనిసరిగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు పొందుతారు. ఈ సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజులు కూడా ఇంకా ఖరారు చేయలేదు.
AP EAPCET Counselling Dates :
ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ జులై మూడో వారంలో చెబుతున్నట్లు సమాచారం. ఆగస్ట్ లో తరగతులు ప్రారంభిస్తారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల కాబోతుంది.
🏹 Official Website – Click here