ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ సంవత్సరం చివరిలో నిరుద్యోగ భృతి పథకం అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు ఇటీవల మచిలీపట్నంలో పర్యటిస్తున్నప్పుడు ప్రకటించారు.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధాన పథకాలు అయిన దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఒకటి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లల తల్లుల అకౌంట్లో తల్లికి వందనం పథకం డబ్బులు జమ చేసింది. అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా జూలై నెలలో పిఎం కిషన్ పథకం డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన వెంటనే , రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేసి రైతుల అకౌంట్లో మొదటి విడతలో భాగంగా 7,000/- జమ చేయనుంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆగస్టు 15వ తేదీ నుండి అమలు చేయబోతున్నట్లు ఇప్పటికే అనేకసార్లు ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టం చేశారు.
తాజాగా మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ భృతి పథకం కూడా ఈ సంవత్సరమే అమలు చేయబోతున్నట్లు ప్రకటించడంతో నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్టికల్ ద్వారా గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ నిరుద్యోగ భృతి యువ నేస్తం అనే పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగుల అకౌంట్స్ లో జమ చేసింది.
నిరుద్యోగ భృతి పథకం కోసం ఉండవలసిన అర్హతలు, అవసరమైన సర్టిఫికెట్స్ మరియు ఇతర వివరాలు కోసం ఆర్టికల్ చివరి వరకు చదవండి..
ప్రతీ రోజూ వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూపులో వెంటనే జాయిన్ అవ్వండి.
నిరుద్యోగ భృతి పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుంది :
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన నిరుద్యోగుల అకౌంట్లో ప్రతినెల 3 వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. అంటే సంవత్సరానికి 36 వేల రూపాయల లబ్ది అర్హులైన నిరుద్యోగులకు చేకూరుతుంది.
నిరుద్యోగ భృతి పథకానికి ఉండవలసిన అర్హతలు :
- కనీసం డిప్లమో లేదా డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి.
- వయస్సు 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారు ఈ పథకానికి అర్హులు కాదు.
- ఈపీఎఫ్ అకౌంట్ లేని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
- కుటుంబానికి 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉండాలి.
- నాలుగు చక్రాలు వాహనం ఉండకూడదు.
- కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు ఉండకూడదు.
- పింఛన్ పొందుతున్న వారు ఈ పథకానికి అనర్హులు.
నిరుద్యోగ భృతి పథకానికి అవసరమైన సర్టిఫికెట్స్ :
- నిరుద్యోగ భృతి పథకం కు అర్హత ఉన్నవారు క్రింది డాక్యుమెంట్స్ ముందుగా సిద్ధం చేసుకోండి. పథకం అమలు చేసి సమయంలో ఈ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయడానికి అవకాశం ఇస్తారు.
- ఆధార్ కార్డు (మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉండాలి)
- బ్యాంక్ అకౌంట్ (బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉండాలి)
- రేషన్ కార్డు
- మీ విద్యార్హతల సర్టిఫికెట్స్ (పదో తరగతి, ఇంటర్, డిప్లమో లేదా డిగ్రీ లేదా పిజి)
- కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువ పత్రం