భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలోగల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంస్థ నుండి టెక్నీషియన్ (RRB TECHNICIAN) ఉద్యోగాల భక్తి కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు NTPC , అసిస్టెంట్ లోకో పైలట్, గ్రూప్ డి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలానే టెక్నీషియన్ (RRB TECHNICIAN) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది , ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) వారు విడుదల చేసిన టెక్నీషియన్ (Technician) ఉద్యోగాల నోటిఫికేషన్ పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
- రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంస్థ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఇందుకు సంబంధించి షార్ట్ నోటీస్ విడుదలైంది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ (టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ & టెక్నీషియన్ గ్రేడ్ 3) ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
🔥 భర్తీ చేయబోయే టెక్నీషియన్ ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,238 టెక్నీషియన్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇందులో
- టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్ – 183
- టెక్నీషియన్ గ్రేడ్ 3 – 6055

🔥 వయస్సు:
- టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాల లోపు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఉద్యోగాలకు సంబంధించి 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల లోపు గలవారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
- అభ్యర్థుల యొక్క కమ్యూనిటీ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు కలదు.
- దివ్యాంగులకు కూడా వయో సడలింపు లభిస్తుంది.
🔥విద్యార్హత:
- టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఉద్యోగాలకు సంబంధించి సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు లేదా డిప్లమో ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం:
- ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
- జూన్ 28వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు ఆన్లైన్ విధానం తర్వాత చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు.
🔥ఎంపిక విధానం:
- టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్ ఆధారిత కంప్యూటర్ వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఎస్సీ , ఎస్టీ, ఈబీసీ, మహిళలు, మైనారిటీలు, ట్రాన్స్ జెండర్, PwBD అభ్యర్థులు 250/- రూపాయలు ఫీజు చెల్లించాలి. బ్యాంక్ చార్జీలు మినహాయించి మొత్తం ఫీజు రిఫండ్ ఇస్తారు.
- మిగతా క్యాటగిరీల అభ్యర్థులు 500/- రూపాయలు ఫీజును చెల్లించాలి. పరీక్ష రాసిన తర్వాత 400/- రూపాయలు ఫీజును బ్యాంకు చార్జీలు మినహాయించి రిఫండ్ ఇస్తారు.
🔥జీతం :
- ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కాబడిన వారికి నెలకు కనీసం 40 వేల రూపాయల వరకు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 28/06/2025.
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 28/07/2025