ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (AP RGUKT IIIT) లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం లో అడ్మిషన్స్ కు సంబంధించి ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ విద్యా , మానవ వనరులు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేశారు.
పదో తరగతి పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది.
2025-2026 విద్యా సంవత్సరంకు సంబంధించి 4,040 సీట్లకు గాను 50,541 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు.. తాజాగా విడుదలైన సెలక్షన్ జాబితా ద్వారా 4,040 సీట్లకు ఎంపికైన విద్యార్థులు జాబితా ప్రకటించారు.

🏹 ఉచితంగా ల్యాప్ టాప్ కావాలి అంటే ఈ స్కాలర్షిప్ కు అప్లై చేయండి – Click here
AP RGUKT IIIT Selection list Percentage :
ఎంపికైన వారిలో 94.78% మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ నుండి 5.22% మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుండి ఎంపికయ్యారు. మొత్తం విద్యార్థుల్లో 69.01% మంది బాలికలు, 30.99% మంది బాలురు ఉన్నారు.
Download AP RGUKT IIIT Counselling Call Letter :
ఎంపికైన విద్యార్థులు కాల్ లెటర్ ను RGUKT వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయవచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 కు మెసేజ్ పంపించి డౌన్లోడ్ చేయవచ్చు.
AP RGUKT IIIT Counselling Dates :
AP RGUKT IIIT అడ్మిషన్స్ కు ఎంపికైన వారికి జూన్ 30వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు..

✅ Official Website – Click here