అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు మీ అకౌంట్లో ఎప్పుడు జమ చేస్తారో తెలుసా ? | Annadhata Sukhibava Scheme

పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం అర్హత ఉన్న రైతులు ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిసి మొత్తం 20,000/- అర్హులైన రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుంది.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల అకౌంట్లో మూడు విడతల్లో ఈ డబ్బులు ప్రభుత్వం జమ చేయనుంది. ఇందులో భాగంగా మొదటి విడతలో 7,000/- రూపాయలను అర్హత ఉన్న రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా 5,000/- రూపాయలు, కేంద్ర ప్రభుత్వ వాటా క్రింద 2,000/- రూపాయలను ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేస్తుంది.

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా మొదటి విడతలో ₹7,000/- లను జూన్ 20వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. కొన్ని కారణాల వలన ఈ పథకం ఈ నెల చివరిలో అమలు కానుంది.

ఇలాంటి వివిధ పథకాల సమాచారం ప్రతీ రోజూ మీ మొబైల్ కు రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ గ్రూపులో ఉచితంగా జాయిన్ అవ్వండి.. మీ నెంబర్ ఎవరికీ కనిపించదు..

అన్నదాత సుఖీభవ పథకం అమలు ఎందుకు ఆలస్యం ?

అన్నదాత సుఖీభవ పథకం అమలు ఆలస్యం కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.. అందులో ముఖ్యమైనవి

  • రైతుల బ్యాంక్ అకౌంట్ ఆధార్ తో లింక్ చేయడంలో సమస్యలు
  • E-KYC ప్రక్రియ పూర్తి కాకపోవడం
  • రాష్ట్రస్థాయిలో అర్హత ఉన్న రైతుల డేటా వెరిఫికేషన్ లో జాప్యం

అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రావాలంటే ఏం చేయాలి ?

అన్నదాత సుఖీభవ పథకంకు మీకు అర్హత ఉండి మీ అకౌంటు లోకి డబ్బులు రావాలి అంటే తప్పనిసరిగా మీరు..

  • https://pmkisan.gov.in/ అనే వెబ్సైట్ లో E-KYC స్టేటస్ తెలుసుకోండి.. మీ సొంతంగా ఈ కేవైసీ స్టేటస్ తెలుసుకోవడం మీకు రాకపోతే మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో సంప్రదించండి.
  • మీ ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నాయా ? లేదా ? అనేది మీ బ్యాంకుకు వెళ్లి ధ్రువీకరించుకోండి.

అన్నదాత సుఖీభవ పథకం అమలు ఎప్పుడు ?

కేంద్ర వ్యవసాయ శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా రైతుల అకౌంట్లో ఎప్పుడు డబ్బులు జమ చేయబోతున్నారో త్వరలో అధికారికంగా సమాచారం రానుంది. కేంద్ర ప్రభుత్వ వాటా క్రింద 2,000/- రూపాయలను జమ చేసే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వ వాటా క్రింద 5,000/- రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది.

ఈ పథకం ద్వారా అర్హులైన వారికి ఈ నెల చివరిలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *