ఈ స్కాలర్షిప్ కు మీరు అప్లై చేస్తే ఉచితంగా ల్యాప్ టాప్, అడ్మిషన్ ఫీజు, హాస్టల్ మరియు మెస్ ఫీజులు ఇస్తారు | Bharti Airtel Scholorship Program 2025-2026

Bharti Airtel Scholorship Program 2025-2026 Apply Link

ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక మంచి స్కాలర్షిప్ కోసం ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ స్కాలర్షిప్ ద్వారా ఉచితంగా ల్యాప్ టాప్, ట్యూషన్ ఫీజులు, హాస్టల్ మరియు భోజనం ఖర్చులు కూడా పొందవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ స్కాలర్షిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ స్కాలర్షిప్ కోసం మీరు పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి మరియు అర్హత ఉన్నవారికి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి..

ఇప్పుడు మీరు భారతి ఎయిర్ టెల్ స్కాలర్షిప్ (Bharti Airtel Scholorship) కోసం తెలుసుకోబోతున్నారు. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు భారతీయ ఎయిర్ టెల్ ఫౌండేషన్ ఈ స్కాలర్షిప్ అందజేస్తుంది. 2025లో సాంకేతిక విద్య అభ్యసిస్తున్న వారు భారతీయ ఎయిర్ టెల్ ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్షిప్ కు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

Bharti Airtel Scholorship కు ఎవరు అర్హులు ?

  • భారతదేశంలో NIRF ర్యాంకు పొందిన ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్నవారు ఈ స్కాలర్షిప్ కు అర్హులు.
  • కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 8.5 లక్షలకు మించి ఉండకూడదు.
  • భారతీయ పౌరులు మాత్రమే ఈ స్కాలర్షిప్ కు అర్హులు
  • ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్ లేదా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులో జాయిన్ అయి చదువుతున్న వారు ఈ స్కాలర్షిప్ కు అర్హులు.

Bharti Airtel Scholorship ద్వారా విద్యార్థులు పొందే సౌకర్యాలు :

  • భారతి ఎయిర్ టెల్ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థులకు మొదటి సంవత్సరంలో ఉచితంగా ల్యాప్ టాప్ ఇస్తారు. ల్యాప్ టాప్ యెుక్క సేఫ్టీ మరియు సెక్యూరిటీ విషయంలో విద్యార్థి బాధ్యత తీసుకోవాలి.
  • దీంతోపాటు ట్యూషన్ ఫీజు, హాస్టల్ మరియు మెస్ ఖర్చులను భారతి ఎయిర్ టెల్ ఫౌండేషన్ విద్యార్థులకు అందిస్తుంది.

🏹 ఏపీలో ఐదు రోజులు ముందే రేషన్ పంపిణీ ప్రారంభం – Click here

Bharati Airtel Scholorship కు అప్లై చేసే విధానం :

  • భారతి ఎయిర్ టెల్ అందిస్తున్న స్కాలర్షిప్ కు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
  • ఆన్లైన్ విధానంలో అప్లై చేసే సమయంలో విద్యార్థులు అవసరమైన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేయడంతో పాటు ఆధార్ కార్డ్, అడ్మిషన్ లెటర్, 12వ తరగతి పాస్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

Bharati Airtel Scholorship అప్లికేషన్ చివరి తేదీ :

భారతీయ ఎయిర్ టెల్ స్కాలర్షిప్ కు జూలై 31వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది..

Bharati Airtel Scholorship పై సందేహాలు ఉంటే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడి :

విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ కు సంబంధించి ఏమైనా సందేహాలు 011-430-9228 అనే నెంబర్ l ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా bhartiairtelscholorship@buddy4study.com అనే మెయిల్ ఐడి ని సంప్రదించవచ్చు.

✅ Apply Scholorship – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!