Headlines

తెలంగాణ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలు భర్తీ | పదో తరగతి పాస్ అయితే చాలు | TGSRTC Outsourcing Conducter Jobs Recruitment 2025

తెలంగాణ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలకు అర్హతలు

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం చూస్తున్న వారికి ముఖ్యమైన అప్డేట్.. రెండు నెలల క్రితం వెయ్యి మంది కండక్టర్లను అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మరో 800 కండక్టర్లను ఔట్సోర్సింగ్ విధానంలో నియమించుకునేందుకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే నియామక ప్రకటన విడుదల కానుంది.. తెలంగాణ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన తాజా సమాచారం క్రింది విధంగా ఉంది..

తెలంగాణ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలు భర్తీ :

హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ లలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొత్తం ఎనిమిది వందల మంది కండక్టర్లను నియమించబోతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ లో 2000 మంది కండక్టర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 500 మంది రెగ్యులర్ విధానంలో ఇప్పటికే పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉద్యోగ విరమణ ల కారణంగా 1500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఇన్ని ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఏర్పడడంతో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ రెగ్యులర్ విధానంలో కండక్టర్ పోస్టులు భర్తీ జరిగే వరకు ఔట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇటీవల రవాణా శాఖ మంత్రి కార్యాలయం నుండి కూడా ఈ ఉద్యోగాల భర్తీకి అనుమతి వచ్చిన నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

తెలంగాణ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాల ఖాళీలు :

హైదరాబాద్ రీజియన్ లో మొత్తం 600 పోస్టులు, వరంగల్ రీజియన్ లో మొత్తం 200 పోస్టులు భర్తీ చేయనున్నారు.

తెలంగాణ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలకు జీతం :

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ పోస్టులకు నియామకం పొందిన వారికి నెలకు 17,969/- జీతము చెల్లిస్తారు.

ఈ జీతంతో పాటు అదనపు గంటలు పనిచేస్తే గంటకు వంద రూపాయలు చెల్లిస్తారు. గంటకు మించినట్లయితే 200 చొప్పున చెల్లిస్తారు.

తెలంగాణ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలకు ఉండవలసిన విద్యార్హతలు :

ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలకు పదో తరగతి పూర్తి చేసిన వారు అర్హులు.

TGSRTC Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!