రాష్ట్రంలో మహిళలకు శుభవార్త ! త్వరలో ఆడబిడ్డ నిధి పథకం అమలు | Aadabidda Nidhi Scheme Full Details

ఆడబిడ్డ నిధి పథకం అమలు తేది

రాష్ట్రంలో మహిళలకు శుభవార్త ! ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు పథకాలను ప్రారంభించిన కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకం త్వరలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపు, తల్లికి వందనం పథకాలను ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసింది. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జూన్ 20వ తేదీ నాటికి అర్హులైన రైతుల అకౌంట్స్ లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుండి ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించారు.

సూపర్ సిక్స్ పథకాల్లో మరో పథకమైన ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేసేందుకు ప్రస్తుతం సిద్ధమవుతోంది.

త్వరలో అమలు కానున్న ఆడబిడ్డ నిధి పథకం :

ఇప్పటికే పలు ముఖ్యమైన పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం త్వరలో ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేయనుంది. ఈ పథకం అమలు కోసం రాష్ట్రంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన మహిళలు అందరూ ఎదురుచూస్తున్నారు.

ఆడబిడ్డ నిధి పథకం – ముఖ్యమైన అర్హతలు :

ఈ పథకానికి రాష్ట్రంలో 18 సంవత్సరాల నిండిన మహిళలు అర్హులు.

తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు అవుతారు.

ఆడబిడ్డ నిధి పథకం ద్వారా జరిగే లబ్ధి :

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోయే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు అందరికీ నెలకు 1500/- చొప్పున వారి బ్యాంక్ అకౌంట్స్ లో ప్రభుత్వం జమ చేయినుంది. అంటే సంవత్సరానికి 18,000/- లబ్ధి ఈ పథకం ద్వారా మహిళలు పొందవచ్చు.

ఆడబిడ్డ నిధి పథకం అప్లై విధానం :

ఆడబిడ్డ నిధి పథకం కు అర్హులైన మహిళలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా గుర్తించనుంది.. లేదా దీనికోసం ప్రత్యేకమైన వెబ్సైట్ తయారుచేసి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించవచ్చు. ప్రస్తుతం కొత్త వెబ్సైట్ సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రక్రియకు సంబంధించి త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఆడబిడ్డ నిధి పథకం కు బడ్జెట్లో కేటాయింపులు :

ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 3,300 కోట్ల రూపాయలు కేటాయించింది.

ఇందులో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళల కోసం సుమారుగా 1000 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం 630 కోట్లు, మైనారిటీ మహిళల కోసం 84 కోట్లు, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల మహిళల కోసం మిగిలిన నిధులను కేటాయించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!