ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా DSC పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జూన్ 20 మరియు జూన్ 21వ తేదీలలో నిర్వహించవలసిన పరీక్షల ను వచ్చే నెల జూలై 01 మరియు జూలై 02 న నిర్వహిస్తాము అని తెలియచేసారు.
ఈ అంశానికి సంబంధించి, పూర్తి సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 DSC పరీక్షా తేదీలలో మార్పులు :
- జూన్ 20 మరియు జూన్ 21వ తేదీలలో నిర్వహించవలసిన డిఎస్సీ పరీక్షల నిర్వహణ తేదీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే భారీగా ఏర్పాటు చేస్తుంది.
- ఈ నేపద్యంలో జూన్ 20 మరియు జూన్ 21 వ తేదీలలో జరగవలసిన DSC పరీక్షలను జూలై 01 & జూలై 02 వ తేదీలలో నిర్వహిస్తామని , ఈ తేదీ మార్పులను అభ్యర్థులు గమనించవలసిందిగా మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఏం.వి కృష్ణారెడ్డి గారు తెలియచేసారు.
- అంతర్జాతీయ యోగా డే సందర్భంగా అభ్యర్థుల యొక్క రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలియచేసారు.
✅ డిగ్రీ అర్హతతో 14,582 ఉద్యోగాలు – Click here
🔥 ఈ నెల 25 వ తేదీన వాయిదా పడిన DSC హాల్ టిక్కెట్లు :
- వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 25 వ తేదీ నుండి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతారు.
- అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి మార్పు చేసిన హాల్ టికెట్లను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని , వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాలి అని మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి కృష్ణారెడ్డి గారు తెలియచేయడం జరిగింది.
✅ DSC Official Website – Click here