ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నుండి ఆశా కార్యకర్తల నియామకం కోసం అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కమ్యూనిటీ ప్రాసెస్, నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో గ్రామ , వార్డు సచివాలయం పరిధిలో ఖాళీగా ఉన్న 55 ఆశా కార్యకర్తల పోస్టులు నియామకం కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

అస కార్యకర్తల ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు :
ఆశా కార్యకర్తల ఉద్యోగాలకు ఖాళీలు ఉన్న గ్రామ సచివాలయం పరిధిలో నివసిస్తున్న పదో తరగతి చదివిన వివాహిత మహిళలు అర్హులు.
ఆశా కార్యకర్తల ఉద్యోగాలకు ఉండవలసిన వయస్సు :
ఆశా కార్యకర్తల ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 42 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులు.
ఆశా కార్యకర్తల ఉద్యోగాల అప్లికేషన్ తేదీలు :
ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జూన్ 4వ తేదీ నుండి జూన్ 10వ తేదీలోపు అప్లై చేయాలి.
🏹 ఏపీలో ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు – Click here
ఆశా కార్యకర్త ఉద్యోగాలకు అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఖాళీలు ఉన్న సచివాలయంలో అందజేయాలి.

ఆంధ్ర ప్రదేశ్ లో ఆశా కార్యకర్తల జీతం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతము ఆశ కార్యకర్తలకు ప్రభుత్వము నెలకు పదివేల రూపాయలు చొప్పున జీతం ఇస్తుంది.
✅ Download Notification – Click here