రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో ఆధార్ డ్రైవ్ లు | సచివాలయం శాఖ సర్క్యులర్ జారీ | Aadhar Drives Dates in June

Aadhar Special Drives
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయం శాఖ ఆధ్వర్యంలో ఆధార్ స్పెషల్ క్యాంప్ లు ప్రతి నెలా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జూన్ నెలలో రెండు సార్లు ఆధార్ క్యాంప్ లు నిర్వహించేందుకు గాను గ్రామ, వార్డ్ సచివాలయం శాఖ డైరెక్టర్ రాష్ట్రం లో గల అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.

జూన్ నెలలో రెండు సార్లు ఈ ఆధార్ క్యాంప్ లు నిర్వహిస్తారు. జూన్ 10 నుండి 13 వ తేదీ వరకు ఒకసారి మరియు జూన్ 24 -27 వరకు మరొకసారి ఆధార్ స్పెషల్ క్యాంప్ డ్రైవ్ లు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో , స్కూల్స్ లో , కాలేజ్ లలో ప్రత్యేక క్యాంప్ లు నిర్వహిస్తారు.

ఆధార్ స్పెషల్ క్యాంప్ లలో ఏ ఏ సర్వీసులు లభిస్తాయి? వాటి రుసుములు ఎంత? అవసరమగు ధ్రువపత్రాలు ఏమిటి ? వంటి వివిధ అంశాల సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🏹 ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదా? ఇలా చేయండి – Click here

🔥 రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో ఆధార్ స్పెషల్ క్యాంపులు :

  • జూన్ 2025 నెలలో నిర్వహించే ఆధార్ స్పెషల్ క్యాంప్ ల నిర్వహణ కొరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
  • ఈ ఆధార్ డ్రైవ్ నెల లో 8 రోజులు అనగా జూన్ 10 -13 & మరియు జూన్ 24 -27 వ తేదీలలో నిర్వహిస్తారు.
  • ఈ ఆధార్ డ్రైవ్ లో 5 నుండి 15 సంవత్సరాల వయస్సు గల 56,21,743 మందికి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా అప్డేట్ (Mandatory Biometric Update) చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు.

🔥 ఆధార్ డ్రైవ్ లో లభించే సేవలు ఇవే :

  • రాష్ట్రం లో నిర్వహించే ఆధార్ డ్రైవ్ లో చాలా సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
  • కొత్త ఆధార్ మరియు బాల ఆధార్ పొందుట
  • ఆధార్ కి పోన్ నెంబర్ లింక్ చేయుట మరియు ఇమెయిల్ లింక్ చేయుట
  • ఆధార్ లో డేట్ ఆఫ్ బర్త్ , చిరునామా, జెండర్ , పేరు మార్చుకొనుట , ఫోటో మార్చుకొనుట
  • బయోమెట్రిక్, ఐరిష్ అప్డేట్ చేయుట
  • Mandatory biometric update
  • ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ మొదలగు సర్వీసులు లభిస్తాయి.

🔥 ఆధార్ సర్వీస్ యొక్క రుసుము :

  • ఆధార్ కార్డ్ సర్వీసులు కొన్ని ఉచితంగా లభిస్తాయి. మరికొన్నింటికి సర్వీస్ ఛార్జ్ చెల్లించాలి.
  • కొత్తగా ఆధార్ పొందేందుకు మరియు బాల ఆధార్ కి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఉచితంగా పొందవచ్చు.
  • ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ చేయుట , పేరు మార్చుట , డేట్ ఆఫ్ బర్త్ మార్చుట, అడ్రస్ మార్చుట వంటి వాటికి 50 రూపాయలు ఫీజు చెల్లించాలి.
  • ఫోటో మరియు బయోమెట్రిక్ అప్డేట్ చేసేందుకు గాను 100 రూపాయల ఫీజు చెల్లించాలి.

✅ ప్రభుత్వ పథకాల సమాచారం మీ వాట్సాప్ కి రావాలి అంటే క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *