RRB NTPC EXAM 2025 | RRB NTPC EXAM ANALYSIS | RRB NTPC Important Topics

RRB NTPC Exam Important Topics
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

దేశవ్యాప్తంగా RRB NTPC పరీక్షలు 05-06-2025 నుండి ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం సుమారు 20 రోజుల పాటు జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఎంతో కాలం నుండి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ప్రతిరోజు మూడు షిఫ్ట్లు విధానంలో ఈ పరీక్షను బోర్డు వారు నిర్వహిస్తున్నారు.

RRB NTPC Exam Paper Analysis :

అయితే ఈ RRB NTPC పరీక్షకు సంబంధించి , ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలతో పాటుగా ఈ సంవత్సరం అడిగిన ప్రశ్నలు కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా ఆ టాపిక్ లను ముఖ్యమైన టాపిక్స్ గా భావించి అభ్యర్థులు ప్రిపేర్ అయితే మంచి మార్కులు పొందవచ్చు.

కావున అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజు జరిగే ఎన్టిపిసి పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ అనాలసిస్ (EXAM ANALYSIS ) ను ఈ ఆర్టికల్లో తెలియజేస్తున్నాం.

పరీక్ష రాసిన అభ్యర్థుల సహకారంతో అభ్యర్థులకు అవగాహన మేరకు మాత్రమే ఈ సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది.

🏹 AP లో హోం గార్డ్ ఉద్యోగాల ముఖ్యమైన షెడ్యూల్ – Click here

🔥ప్రారంభం అయిన RRB NTPC పరీక్షలు :

  • దేశవ్యాప్తంగా RRB NTPC పరీక్షలు ప్రారంభం అయ్యాయి.
  • రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంస్థ జూన్ 5న ఈ పరీక్షలను నిర్వహించింది. మొత్తం మూడు షిఫ్ట్స్ లలో పరీక్ష జరిగింది.
  • పరీక్షలో 100 ప్రశ్నలకు గాను వంద మార్కులు కేటాయించారు.
  • మొదటి షిఫ్ట్ పరీక్ష ఉదయం 09:00 గంటల నుండి 10:30 గంటల వరకు జరిగింది.
  • రెండవ షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 12:45 నుండి 2:15 వరకు జరిగింది.
  • మూడవ షిఫ్ట్ పరీక్ష 04:30 నుండి 06:30 వరకు జరిగింది.

🔥RRB NTPC పరీక్ష లో అడిగిన ప్రశ్నలు & టాపిక్స్ ఇవే :

జూన్ 05 న జరిగిన NTPC పరీక్షలో వివిధ అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడగడం జరిగింది. అవి

  • సాంబార్ లేక్ ఏ రాష్ట్రంలో కలదు?
  • సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఏ రాజ్యాంగ సవరణకు సంబంధించిన కమిటీ?
  • భారత రాజ్యాంగంలో అధికారిక భాషల కొరకు తెలియజేసే షెడ్యూల్?
  • శ్వేత విప్లవ పితామహుడు ఎవరు ?
  • LPG abbreviation
  • వల్లభి ఆలయ ఆకారం ?
  • జి ఐ ట్యాగ్ పై ఒక ప్రశ్న
  • ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పై ఒక ప్రశ్న
  • ర్యాంకులు మరియు రిపోర్ట్లు పై ఒక ప్రశ్న
  • ప్రభుత్వ పథకాలనుండి ఒక ప్రశ్న
  • 106వ రాజ్యాంగ సవరణపై ఒక ప్రశ్న
  • జల్ జీవన్ మిషన్ పథకం పై ఒక ప్రశ్న
  • MS office మరియు ఆపరేటింగ్ సిస్టంపై ఒక ప్రశ్న
  • భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్య ప్రాంతం ఏది?
  • భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయి ఎన్నో వారు?
  • SIMBEX 2024 ఎక్కడ జరిగింది?
  • మహానది పొడవు ఎంత?
  • 1555 లో సికిందర్ సూరి ను ఓడించిన మొగల్ చక్రవర్తి ఎవరు?
  • భారత దేశం లో మొదటి గ్రామీణ ప్రాంతీయ బ్యాంకు ఏది?
  • FTP అనగా?
  • భూకర్ ప్రైజ్ 2024 ఎవరికి లభించింది?
  • మహాత్మా గాంధీ 1920 వ సంవత్సరంలో ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు?
  • పంచవర్ష ప్రణాళికను ఎవరు తయారు చేస్తారు?
  • ఇలా వివిధ టాపిక్ ల నుండి వివిధ ప్రశ్నలు అడగడం జరిగింది.

🔥 RRB NTPC ఎగ్జామ్ అనాలసిస్:

  • జూన్ 5వ తేదీనాడు జరిగిన NPTC పరీక్షలు ఈజీ టు మోడరేట్ స్థాయిలో ఉన్నాయి.
  • అర్థమెటిక్ మరియు రీజనింగ్ ప్రశ్నలు సులభతరంగా వచ్చినట్లు తెలుస్తోంది.
  • జనరల్ అవేర్నెస్ లో హిస్టరీ క్వాలిటీ ప్రశ్నలు ఈజీగానే ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయి. అయితే సైన్స్ విభాగానికి సంబంధించి అభ్యర్థులు కొంచెం ఇబ్బంది పడినట్లు అనిపిస్తుంది. ప్రశ్నలు సాధారణ స్థితిలోనే ఉన్నప్పటికీ సైన్స్ సబ్జెక్టులపై ఆసక్తి చూపకపోవడమే సైన్స్ విభాగంలో ప్రశ్నలను ఆన్సర్ చేయలేకపోయారని విశ్లేషకులు భావిస్తున్నారు.
  • జీకే మరియు కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఎక్కువగా 2024వ సంవత్సరం సంబంధించి ప్రశ్నలు కనిపించాయి.
  • జూన్ 5న జరిగిన Shift – 03 పరీక్ష మోడరేట్ టు డిఫికల్ట్ రేంజ్ లో ఉన్నట్లు అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.

10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు – Click here

Note:

  • ఈ సమాచారం ను పరీక్ష రాసిన అభ్యర్థుల నుండి సేకరించిన వివరాలు ద్వారా తెలియచేయడం జరిగింది. అభ్యర్థుల ప్రిపరేషన్ స్థాయి బట్టి వారి అంచనా మారవచ్చు అని గమనించగలరు.

🏹 Download RRB NTPC Hall Tickets – Click here

ఇంతవరకు RRB NTPC Hall Tickets డౌన్లోడ్ చేసుకొని వారు పైన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా ఇచ్చి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *