ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఐడి విభాగంలో హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి కొద్దిరోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే.
ఇంటర్మీడియట్ విద్యార్హత తో 28 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఉద్యోగాలకు 12,569 మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడంతో అధికారులు అప్లికేషన్స్ ప్రాథమిక పరిశీలన చేశారు. ప్రాథమిక పరిశీలన అనంతరం 7,684 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా గుర్తించి వీరికి మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ లో శారీరిక కొలతలు పరీక్షలు మరియు ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు.
హోంగార్డు ఉద్యోగాలకు షెడ్యూల్ విడుదల :
హోంగార్డ్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఏ తేదీల్లో హాజరు కావాలి అనేది తెలియజేస్తూ సిఐడి వెబ్సైట్లో షెడ్యూల్ విడుదల చేశారు. జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులకు మంగళగిరిలో ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో శారీరక కొలతలు పరీక్షలు మరియు ధృవపత్రాలు పరిశీలన ప్రారంభం కానుంది. జూన్ 17 సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ధ్రువ పత్రాలు పరిశీలన జరగనుంది.
🏹 Download Candidates Schedule – Click here
హోంగార్డు ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు :
హోంగార్డు ఉద్యోగాలకు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో దరఖాస్తులు స్వీకరించడంతో డిగ్రీ , పీజీ, బీటెక్ మరియు ఇతర కోర్సులు చేసిన వారు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రోజుకు 710/- రూపాయలు చొప్పున చెల్లిస్తారు. ఇవి శాశ్వత ఉద్యోగాలు కానప్పటికీ ప్రస్తుతం ఉన్న నిరుద్యోగం కారణంగా నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అధికంగా పోటీపడుతున్నారు. ఒక్క పోస్టుకు దాదాపుగా 275 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
హోంగార్డు ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ముఖ్యమైన అప్డేట్ :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు సిఐడి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీకు శారీరిక కొలతలు మరియు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించే తేదీలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాల్సి ఉంటుంది.

🏹 Official Website – Click here