ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాప్ ల వద్దే రేషన్ పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా, సౌకర్యవంతంగా రేషన్ పంపిణీ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా విషయమే ప్రస్తుతం ఉన్న రేషన్ షాప్ డీలర్ లకు రాష్ట్ర ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
🔥 జూన్ 1 నుండి రేషన్ పంపిణీకి పక్కా ఏర్పాట్లు :
- పౌర సరఫరాల దుకాణాలు ద్వారా పండగ వాతావరణంలో రేషన్ పంపిణీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ గా ఏర్పాట్లు చేస్తుంది.
- గతంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ జరిపినప్పటికీ, ప్రభుత్వ రేషన్ పక్కదారి పట్టడం, కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లోనే రేషన్ పంపిణీ చేసి మిగతా రోజుల్లో పంపించిక పోవడం వంటి అనేక కారణాలు చేత రాష్ట్ర ప్రభుత్వం మరలా చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేసేందుకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
- ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ సక్రమంగా జరిగేందుకు గాను, డిజిటల్ విధానంలో రేషన్ పంపిణీ కొరకు ఏర్పాట్లు చేస్తోంది.
🔥జూన్ 1వ తేదీ నుండి మార్గదర్శకాలు ఇవే (AP Ration Supply Instructions):
- రేషన్ షాప్ లో అందుబాటులో ఉండే సరుకులు వివరాలు, వాటి ధరలు మరియు రేషన్ డీలర్ యొక్క ఫోన్ నెంబర్ మొదలగు అంశాలు కలిగిన బోర్డు ప్రజలందరికీ కనిపించే విధంగా అందుబాటులో ఉంచాలి.
- ఈపాస్ యంత్రము మరియు తూకము పరికరాలను సిద్ధం చేసుకోవాలి.
- చౌక ధరల దుకాణాన్ని అందంగా అలకరించి, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
- జూన్ 01 వ తేదీన ప్రజా ప్రతినిధులు, వయో వృద్ధులు , గ్రామ పెద్దలను రేషన్ పంపిణీ కార్యక్రమం నకు ఆహ్వానించి, ఘనంగా ప్రారంభించాలి అని ఆదేశాలు జారీ అయ్యాయి.
- రేషన్ తీసుకోవడానికి వచ్చే ప్రజలకు త్రాగునీరు, వారు కూర్చోడానికి అవసరమగు బల్లలు ఏర్పాటు చేయవలసి వుంటుంది.
- ప్రస్తుతం కరోనా కేసులు ప్రబలే అవకాశం ఉన్న నేపధ్యంలో ప్రజలు కూడా మాస్క్ లు ధరించి, సామాజిక దూరం పాటించేలా సూచనలు జారీ చేశారు.
- లబ్ధిదారులు రాష్ట్రంలో గల ఏ రేషన్ దుకాణం నుండి అయినా రేషన్ పొందేందుకు అవకాశం కల్పించారు.
🏹 ప్రతిరోజు ప్రభుత్వ పథకాల సమాచారం మీ మొబైల్ కి రావాలి అంటే క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూపులో ఉచితంగా జాయిన్ అవ్వండి.
ఆంధ్రప్రదేశ్ రేషన్ సప్లై వేళలు ఇవే (Andhra Pradesh Ration Supply Timings) :
- ప్రతీ నెల 1వ తేదీ నుండి 15 వ తేదీ వరకు ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మరియు సాయంత్రం 04:00 గంటల నుండి రాత్రి 08:00 గంటల వరకు రేషన్ షాపులు అందుబాటులో ఉండాలి.
🏹 ఒక రోజు ముందుగానే రాష్ట్రంలో రేషన్ పంపిణీ – Click here
🔥 వీరికి 05 వ తేదీ లోగా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ :
- లబ్దిదారులు అందరికి రేషన్ షాప్ వద్ద జూన్ 1న రేషన్ పంపిణీ చేయడం తో పాటు 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు మరియు వికలాంగులకు ఇంటివద్దే రేషన్ పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి సంబంధించి కూడా రేషన్ డీలర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
- ఇందుకు గాను వీరికి రేషన్ పంపిణీ ఎప్పుడు చేస్తారో సంబంధిత సమాచారాన్ని ముందుగానే వారికి చేరవేయవలసి వుంటుంది.