సచివాలయం సిబ్బంది ద్వారా కొత్తగా ఇంటింటి సర్వే చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం | Yogandhra – 2025 Survey Details

Yogandhra - 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటి సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

ఈ సర్వేలో భాగంగా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి మీరు యోగా చేస్తుంటారా ? విశాఖపట్నంలో జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొంటున్నారా ? లేదా మీకు దగ్గరలో ఉండే సచివాలయంలో నిర్వహించే యోగ దినోత్సవానికి హాజరవుతారా ? లాంటి ప్రశ్నలు అడుగుతారు. 

సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రెండు ప్రశ్నలు అడుగుతారు. అందులో మొదటిది మీరు యోగా చేస్తుంటారా ? లేదా ?

ప్రజలు యోగ చేయడం లేదు అంటే సర్వే అక్కడితో ముగిస్తారు. యోగ చేస్తున్నట్లుగా చెబితే విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవానికి మీరు హాజరవుతున్నారా అని అడుగుతారు ? వెళ్లడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని అడుగుతారు ? లేదా దగ్గరలో ఉండే గ్రామ , వార్డు సచివాలయంలో జరిగే యోగా దినోత్సవం లో పాల్గొంటారా అని ప్రశ్నిస్తారు? ఈ రెండూ కాకపోతే యోగ దినోత్సవం రోజు కోసం ఇతర ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా అని అడుగుతారు ?

🏹 యోగాంధ్ర – 2025 : 

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనం గా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

ఇందులో భాగంగా ప్రతీ గ్రామ, వార్డు సచివాలయంలో కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అలానే జూన్ 21న విశాఖపట్నం లో యోగా డే కార్యక్రమం ను రికార్డ్ స్థాయిలో నిర్వహించేందుకు గాను యోగాంధ్ర – 2025 పేరు మీదుగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధాని మోదీ హాజరవుతున్న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో రెండు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు పాల్గొనే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. 

🔥 యోగాంధ్ర – 2025 & విస్తృత అవగాహన :

ఆంధ్రప్రదేశ్ లో యోగాంధ్ర – 2025 నెల రోజుల పాటు యోగా అవగాహన కొరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

యోగా మన దేశానికి వారసత్వ సంపద , ఇది మన భారత దేశ జీవన విధానం లో భాగంగా వస్తుంది. ప్రధానమంత్రి మోదీ గారి కృషి వలన యోగా కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. మోదీ గారి కృషి వలన డిసెంబర్ 2014 లో ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య సమావేశం లో ప్రపంచమంతా యోగా దినోత్సవం నిర్వహించాలి అనే తీర్మానం చేశారని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు.

🔥 జూన్ 21 న విశాఖలో 5 లక్షల మందితో యోగా కార్యక్రమం :

జూన్ 21, 2025 తేదీన విశాఖ లోని ఆర్కె బీచ్ నుండి భోగాపురం వరకు కనీసం 5 లక్షల మంది ప్రజలతో ఉదయం 7 నుండి  8 గంటల మధ్య రికార్డ్ స్థాయిలో యోగా కార్యక్రమం ను నిర్వహించనున్నారు.

అలానే రాష్ట్రం లో 2 కోట్ల మందికి తగ్గకుండా యోగా కార్యక్రమం లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాల పర్యవేక్షణ కొరకు మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *