విశాఖపట్నంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ యొక్క హోమీ బాబా క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (TMC HBCHRC) నుండి నర్స్ , ప్రాజెక్టు స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, అడ్ హాక్ కన్సల్టెంట్ మరియు హిస్టో పాథాలజీ టెక్నీషియన్ ఉద్యోగాలను ఆరు నెలల కాలానికి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను ఆరు నెలల కాలానికి భర్తీ చేస్తున్నప్పటికీ ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి కాల పరిమితి పెంచుతారు.
అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
🏹 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- విశాఖపట్నంలో ఉన్న హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ తాజాగా విడుదల చేసిన నాలుగు నోటిఫికేషన్ల ద్వారా నర్స్ , ప్రాజెక్టు స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, అడ్ హాక్ కన్సల్టెంట్ మరియు హిస్టో పాథాలజీ టెక్నీషియన్ అనే ఉద్యోగాల కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఇంటర్వ్యూ జరిగే తేదీలు :
- అడ్ హాక్ కన్సల్టెంట్ ఉద్యోగానికి జూలై 28వ తేదీన ఉదయం 9:30 నుండి 10:30 మధ్య వాక్ ఇన్ ఇంటర్వూలు నిర్వహిస్తున్నారు.
- హిస్టో పాథాలజీ టెక్నీషియన్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు 28వ తేదీన ఉదయం 9:30 నుండి 10:30 మధ్య వాక్ ఇన్ ఇంటర్వూలు నిర్వహిస్తున్నారు.
- నర్సు ఉద్యోగాలకు జూలై 29వ తేదీన ఉదయం 9:30 నుండి 10:30 మధ్య వాక్ ఇన్ ఇంటర్వూలు నిర్వహిస్తున్నారు.
- ప్రాజెక్ట్ స్టాఫ్ నర్స్ మరియు, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఆగస్టు 5వ తేదీన ఉదయం 9:30 నుండి 10:30 వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
✅ రైల్వేలో పారామెడికల్ కేటగిరి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here
జీతము వివరాలు :
- నర్సు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 33,000/- జీతం ఇస్తారు.
- ప్రాజెక్టు స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 33,600/- జీతం ఇస్తారు.
- ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి ఎంపికైన వారికి 22,000/- నుండి 35,000/- వరకు జీతము ఇస్తారు.
- హిస్టో పాథాలజీ టెక్నీషియన్ ఉద్యోగానికి ఎంపికైన వారికి 25,000/- నుండి 35,000/- వరకు జీతం ఇస్తారు.
- అడ్ హాక్ కన్సల్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 1,32,000/- నుండి 1,42,000/- వరకు జీతము ఇస్తారు.
🏹 ఫీజు వివరాలు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి , ఇంటర్వ్యూకు హాజరుకావడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🏹 ఇంటర్వ్యూలు జరిగే ప్రదేశం :
- విశాఖపట్నంలో అగనంపూడి వద్ద ఉన్న హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వద్ద ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఆసక్తి ఉన్నవారు ఈ సంస్థ HRD డిపార్ట్మెంట్, ఫస్ట్ ఫ్లోర్ లో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🏹 ఇంటర్వ్యూలకు తీసుకొని వెళ్లాల్సిన సర్టిఫికెట్స్ :
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డ్ కాపీ, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
🏹 ఎంపిక విధానము :
- అర్హతు ఉండే అభ్యర్థులు తప్పనిసరిగా పైన తెలిపిన డాక్యుమెంట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఎలాంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
✅ Download All Notifications – Click here
✅ Official Website – Click here