రేషన్ తీసుకోకపోతే నగదు బదిలీ చేస్తాం – పౌరసరఫరాల శాఖ మంత్రి వెల్లడి | AP Ration Supply Latest News Today

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతుంది. గతంలో ఎండీయూ వాహనాలు ద్వారా పంపిణీ చేసేటప్పుడు కంటే  ఇప్పుడు రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయడం తో పోల్చినప్పుడు రేషన్ దుకాణాల్లో పంపిణీ చాలా ఎక్కువగా ఉంది. 

అలానే రేషన్ పంపిణీ ప్రక్రియ గురించి మరియు రేషన్ తీసుకోకపోతే నగదు బదిలీ నిమిత్తం పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కీలక వాఖ్యలు చేయడం జరిగింది. 

పై సమాచారానికి సంబంధించి పూర్తి అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 శరవేగంగా రేషన్ పంపిణీ :

  • రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 
  • గతంలో ఎండియు వాహనాలు ద్వారా ఒక్కరోజులో పంపిణీ చేసే రేషన్ కంటే రేషన్ షాపుల ద్వారా ఎక్కువగా రేషన్ పంపిణీ జరిగింది.
  • ప్రజలు కూడా ఈ రేషన్ పంపిణీ లో అధికంగా భాగమయ్యారు.
  • తొలి రోజు 18.87 లక్షల కుటుంబాల వారు రేషన్ షాపుల ద్వారా రేషన్ పొందడం ప్రజల నుండి మంచి స్పందన లభించిందని భావించవచ్చు.

🏹 డిగ్రీ పూర్తి చేసిన మహిళలకు డిజిటల్ లక్ష్మి గా నియమిస్తున్న ప్రభుత్వం – Click here

🔥 మరింత పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ :

  • రేషన్ దుకాణాల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీలో భాగంగా పాల్గొన్న పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రజా పంపిణీ వ్యవస్థ ను పారదర్శకంగా నడిపిస్తామని తెలియజేశారు.
  • తొలిరోజు తొలి నాలుగు గంటల్లోనే 8 లక్షలకు పైగా కుటుంబాలకు రేషన్ పంపిణీ జరిగింది అని తెలియజేశారు. 
  • గతంలో పేదలకు పంచాల్సిన రేషన్ దుర్వినియోగం అయ్యిందని , ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా రేషన్ పంపిణీ చేస్తుందని తెలియచేసారు.
  • రేషన్ పంపిణీ పై నిఘా ఉంటుంది అని , రేషన్ షాప్ లలో సీసీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పనిచేసే కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలియచేసారు.
  • రేషన్ పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా అనే అంశంపై ప్రజల నుండి అభిప్రాయ సేకరణ కొరకు రేషన్ షాపుల వద్ద క్యూఆర్ కోడ్  మరియు అధికారుల ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేస్తామన్నారు.

🔥 15.60 లక్షల మందికి ఇంటి వద్దనే రేషన్ పంపిణీ :

  • ప్రభుత్వం ప్రకటించిన విధంగానే 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు మరియు దివ్యంగులకు వారి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయుటకు గాను కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. 
  • ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15.60 లక్షల మందికి ప్రతి నెల 5వ తేదీ లోపు గానే వారి ఇంటి వద్దనే రేషన్ పంపిణీ జరుగుతుంది. దీని కొరకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ లను ఏర్పాటు చేస్తామని ఈ గ్రూపులలో వారికి ఏ తేదీ ఏ సమయం నాడు రేషన్ పంపిణీ చేస్తాము ముందుగానే సమాచారాన్ని తెలియజేస్తామని చెప్పారు.

🔥 రేషన్ తీసుకోకపోతే నగదు బదిలీ :

  • రేషన్ పంపిణీ ప్రక్రియలో భాగంగా ఎవరైనా ప్రజలు రేషన్ వద్దు అనుకున్నట్లయితే  వారికి ఆ రేషన్ సంబంధించిన నగదును బదిలీ చేస్తామని మంత్రి  తెలియజేశారు.
  • ఇందుకుగాను వారి యొక్క ఎకౌంట్లోనే నగదు బదిలీ చేసే విధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో నగదు బదిలీ ప్రక్రియ చేస్తామని మంత్రి గారు వివరించారు.

🏹 పదో తరగతి తర్వాత ఈ కోర్సు పూర్తి చేస్తే వెంటనే ఉద్యోగం వస్తుంది – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *