Andhra Pradesh New Ration Cards – No Marriage Certificate Required :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ దరఖాస్తుల నిమిత్తం ఒక మంచి అప్డేట్ తెలియచేసింది.
ఇప్పటికే రేషన్ కార్డ్ లకు సంబంధించి వివిధ సర్వీసులను పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ మరియు వార్డు సచివాలయంల ద్వారా అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం రేషన్ కార్డ్ కి దరఖాస్తు చేసుకొనేందుకు అవసరగు ధ్రువపత్రాల విషయమే అధికారిక ప్రకటన చేసింది మరియు ప్రజలు రేషన్ కార్డ్ కి దరఖాస్తు చేసుకొనేందుకు ఎటువంటి ప్రయాసలు పడకుండా సులభంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది.
ఈ అప్డేట్ కి సంబంధించి సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 ఏపీలో కొత్త రేషన్ కార్డులుకు whatsapp లో దరఖాస్తులు ఆహ్వానం – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
AP New Ration Cards Apply Process :
🔥 వీరికి రేషన్ కార్డ్ దరఖాస్తు కొరకు మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు :
ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉండి, పెళ్లి అయి ఒకే కుటుంబంగా కలిసి ఉన్న వారు, రెండు పెళ్లి అయిన జంటల కలిగి వున్న వారు పాత రేషన్ కార్డ్ నుండి విడిపోయి, నూతనంగా రేషన్ కార్డ్ పొందేందుకు గాను మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు అని పౌర సరఫరాల శాఖా మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ గారు తెలియచేసారు.
మ్యారేజ్ సర్టిఫికెట్ లేదు అన్న కారణంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వీలనంత త్వరగా గ్రామ వార్డు సచివాలయం వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 వాట్సప్ ద్వారా రేషన్ కార్డ్ సేవలు ప్రారంభం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే తెలిపిన విధంగా మే 15 వ తేదీ నుండి మన మిత్ర చాట్ బాట్ ద్వారా రేషన్ కార్డ్ లకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.
ముందుగా మన మిత్ర వాట్సాప్ నెంబర్ 95523000009 ను సేవ్ చేసుకొని , Hi అని మెసేజ్ చేయాలి.
తర్వాత సర్వీస్ నిమిత్తం civil supplies department లో మీకు అవసరమగు రేషన్ కార్డ్ సర్వీస్ ను ఎంచుకోవాలి.
ప్రాథమిక వివరాలు ఎంటర్ చేసి, సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి , పేమెంట్ చేయాలి.
వాట్సప్ ద్వారా నూతన రైస్ కార్డు ల జారీ, రైస్ కార్డ్ విభజన, అడ్రస్ మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, కార్డ్ సరెండర్ వంటి సేవలను పొందే అవకాశం కల్పించారు.
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.