రాష్ట్రంలో పేదల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం | ఇక మండలాల్లోనూ అన్న క్యాంటీన్లు

అన్న క్యాంటీన్లు
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి… రాష్ట్రంలో ఈ పథకం అమలు చేయడం పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈ పథకం అమలు వలన ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం అన్న క్యాంటీన్లు పట్టణాలు మరియు జిల్లా కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. తాజాగా మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అన్న క్యాంటీన్లను మండలాల్లో కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు.

Join Our What’s App Group – Click here

2018 లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు :

2018 సంవత్సరంలో కేవలం ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ ద్వారా భోజనం అందించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్న క్యాంటీలను ఏర్పాటు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో టిడిపి పార్టీ ఓడిపోవడం, వైసిపి పార్టీ అధికారం చేపట్టడంతో ఈ పథకం అక్కడితో ఆగిపోయింది. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టిడిపి పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్న క్యాంటీన్ లను ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే..

మండలాల్లోనూ అన్న క్యాంటీన్లు :

ప్రస్తుతం రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరో 9 అన్న క్యాంటీన్లు కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు మండలాల్లో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తుంది.

అన్న క్యాంటీన్లు ద్వారా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు :

రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ద్వారా ప్రజలకు ఐదు రూపాయలకే ప్రతి పూట కడుపు నింపుతోంది. ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ ఉంటాయి. ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన మెనూ ప్రకారం అన్నా క్యాంటీన్లు లో ఆహారం అందిస్తున్నారు. అన్నా క్యాంటీన్లు వలన ప్రభుత్వానికి సంవత్సరానికి ₹200 కోట్లు ఖర్చు అవుతుంది..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *