యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ఉద్యోగాలు | UBI SO Notification 2025 | Latest Bank Jobs

ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) సంస్థ  నుండి యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2025-26 ద్వారా స్పెషలిస్ట్ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మొత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా ఇందులో అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 250 మరియు అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) 250 ఖాళీలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , అవసరగు వయస్సు ,పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు  

పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) సంస్థ దేశ వ్యాప్తంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

మొత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) –  250

అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) –  250

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) & అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) అనే స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత :

ఈ  ఉద్యోగాలకు సంబంధించి ఈ క్రింది విద్యార్హతలు అవసరమగును.

విద్యార్హత కి సంబంధించి 20/05/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.

అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) :

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ / సంస్థ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి మరియు CA / CMA (ICWA) / CS ఉత్తీర్ణత సాధించాలి.

అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) :

కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ &  టెలికమ్యూనికేషన్స్ / డేటా సైన్స్/మెషిన్ లెర్నింగ్ & AI / సైబర్ సెక్యూరిటీ విభాగంలో B.E / B.tech / MCA / MSc(IT) / 5 సంవత్సరాల M.tech ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం పని అనుభవం కలిగి వుండాలి.

🔥  వయస్సు :

22 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు &  ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు & PWBD వారికి 10 సంవత్సరాలు &  Ex – సర్వీస్ మాన్ వారికి 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

వయస్సు నిర్ధారణ కొరకు 01/04/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు :

 ఎస్సీ , ఎస్టీ , PwBD అభ్యర్థులు 177/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

మిగతా అందరు అభ్యర్థులు 1180/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం :

అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష / గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ  నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

 🔥 ఆన్లైన్ పరీక్షా విధానం :

మొత్తం 225 మార్కులకు గాను పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 150 ప్రశ్నలు వుంటాయి & 150 నిముషాల సమయం కేటాయించారు. ఇవి బహులైచ్చిక ప్రశ్నలు. ప్రశ్నాపత్రాన్ని రెండు భాగాలుగా విభజించారు.

పార్ట్ – 1 లో భాగంగా  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలకు 25 మార్కులు) రీజనింగ్ (25 ప్రశ్నలకు 25 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలకు 25 మార్కులు) ప్రశ్నలు వుంటాయి.

పార్ట్ – 2 లో సంబంధిత పోస్టుకి సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధిత అంశాల పై 75 నిముషాలకు 75 ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులు కేటాయించారు.

¼ వ వంతు నెగెటివ్ మార్కుల విధానం కలదు.

🔥 పరీక్ష కేంద్రాలు : 

దేశంలోని పలు ప్రముఖ నగరాలతో పాటు   తెలుగు రాష్ట్రాలలో కూడా పలు నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ :

అమరావతి, విజయవాడ / గుంటూరు విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలను ఎంపిక చేశారు.

తెలంగాణ : హైదరాబాద్, వరంగల్ కేంద్రాలను ఎంపిక చేశారు.

🔥 జీతం : 

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 80,000/- రూపాయలకి పైగా జీతం లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదిలు :

ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 30/04/2025

ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 20/05/2025

👉  Click here for notification 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!