మీ రేషన్ కార్డు స్టేటస్ మీ మొబైల్ లో తెలుసుకోండి ఇలా | AP New Ration Cards Status | How to Check New Ration Card Status in Telugu

AP New Ration Card status

How to Check AP New Ration Cards Status : 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా రేషన్ కార్డులను పొందేందుకు గ్రామ, వార్డు సచివాలయల ద్వారా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.  అయితే దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకునే అంశం పై చాలా మందికి అవగాహన లేకపోవడం తో దరఖాస్తు యొక్క ప్రస్తుత స్థితిని అంచనా వేయలేకపోతున్నారు.

ఈ క్రింది ఆర్టికల్ లో రేషన్ కార్డు దరఖాస్తు యొక్క స్టేటస్ చెక్ చేసుకునే విధానం గురించి సవివరంగా తెలియచేయడం జరిగింది. ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదివి రైస్ కార్డు చెక్ చేసుకోగలరు.

🔥 రైస్ కార్డ్ స్టేటస్ చెక్ చేయు విధానం :

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త గా రేషన్ కార్డ్ లలో మార్పులు, చేర్పులు, కొత్త రేషన్ కార్డ్ పొందేందుకు గాను గ్రామ, వార్డ్ సచివాలయలు ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
  • ఇప్పటికే చాలా మంది రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్నారు.
  • అయితే ఈ దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ స్టేటస్ ను చాలా ఈజీ గా ఎటువంటి లాగిన్ లేకుండా అధికారిక వెబ్సైట్ లో తెలుసుకొనేందుకు అవకాశం ఉంది.
  • ముందుగా దరఖాస్తు చేసుకున్న వారు వారు యొక్క అప్లికేషన్ రిసీప్ట్ ను గ్రామ వార్డు సచివాలయం వద్ద తీసుకోవాలి.
  • అప్లికేషన్ లో గల దరఖాస్తు నెంబర్ తో అప్లికేషన్ యొక్క స్టేటస్ ను తెలుసుకోవచ్చు.
  • అధికారిక వెబ్సైట్ ఏపీ సేవా పోర్టల్  https://vswsonline.ap.gov.in/ లో కుడి  వైపున పైన Service Request Status Check లో అప్లికేషన్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత Captcha ను ఎంటర్ చేసి, దరఖాస్తు స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.

🔥 రైస్ కార్డ్ వెరిఫికేషన్ ఇలా ఉంటుంది :

  • దరఖాస్తు చేసుకున్న రైస్ కార్డ్ వెరిఫికేషన్ ను మూడు దశలలో వెరిఫై చేస్తారు.
  • ముందుగా కుటుంబం లో ఉన్న సభ్యులు అందరూ కూడా గ్రామ, వార్డు సచివాలయం లో ఉన్న డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి వారి యొక్క ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేయాలి.
  • తర్వాత దరఖాస్తు గ్రామ రెవెన్యూ అధికారి వారి లాగిన్ కి వెళ్తుంది. గ్రామ రెవెన్యూ అధికారి వారు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు.
  • తర్వాత చివరిగా మండల రెవెన్యూ అధికారి / తహసిల్దార్ వారి లాగిన్ లో దరఖాస్తు అప్రూవల్ అయ్యాక దరఖాస్తు వెరిఫికేషన్ పూర్తి అవుతుంది.
  • అప్లై చేసుకున్న వారు వారి యొక్క దరఖాస్తు ఎక్కడ పెండింగ్ ఉంది అనేది పైన పేర్కొన్న విధంగా చెక్ చేసుకోవచ్చు.

👉 Click here to Know Rice Card Status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!