ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు శుభవార్త.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధాన పథకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుండి పక్కాగా అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రులు మరియు ఆర్టీసీ చైర్మన్ కూడా ప్రకటన చేశారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో పాటు అనేక ఏర్పాట్లు చేస్తుంది… తాజాగా ఈ పథకం అమలుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయి.
Table of Contents
స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు :
ప్రస్తుతం సోషల్ మీడియాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించిన ఒక టికెట్ వైరల్ అవుతుంది.. ఈ టికెట్ లో ఉన్న వివరాలు ప్రకారం ఈ పథకాన్ని స్త్రీ శక్తి అనే పేరుతో అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ టికెట్ లో టికెట్ తీసుకున్న మహిళ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తున్నారు, ప్రయాణానికి అయ్యే ఖర్చు ఎంత , ప్రభుత్వం భరిస్తున్న ఖర్చు ఎంత మరియు ఉచిత బస్సు ప్రయాణం పథకంలో భాగంగా ఈ టికెట్ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిసే విధంగా వివరాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు గతంలోనే అధికారులకు మహిళలకు జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుదినంగానే ఈ టికెట్ తయారుచేసినట్టు తెలుస్తోంది…
ఉచిత బస్సు ప్రయాణం కోసం ఐడి కార్డు తప్పనిసరి :
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులో భాగంగా బస్సులో ప్రయాణించే మహిళలు ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా పాన్ కార్డ్ వంటి ఐడీ కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఐడి కార్డు చూపించిన మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు.
ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం :
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ మరియు నగరాల్లో మెట్రో ఎక్స్ ప్రెస్ , సిటీ ఆర్డినరీ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తారు..