మీరు పదో తరగతి పూర్తి చేశారా ? పదో తరగతి తర్వాత ఏం చదవాలి అనేది తెలియడం లేదా ? పదో తరగతితో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా ? అయితే ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి. మీ అభిరుచికి తగిన మార్గాన్ని ఎంచుకోండి..
పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు అనేక విద్యా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి పూర్తయిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టీ ఈ సమయంలో మీ ఎంపిక చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు.
పదో తరగతి తరువాత విద్యావకాశాలు (Career Options After 10th Class) :
- ఇంటర్మీడియట్ :
- పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతారు..
- ఇంటర్మీడియట్లో MPC, Bipc, CEC, MEC, HEC వంటి వివిధ రకాల కోర్సులు ఉంటాయి.
- MPC పూర్తి చేసినవారు ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సులు చదువుకోవచ్చు.
- BiPC పూర్తి చేసిన వారు మెడికల్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి కోర్సులు పూర్తిచేసి ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
- CEC/ MEC / HEC వంటి కోర్సులు పూర్తి చేసిన వారు వాణిజ్య రంగం, బిజినెస్ స్టడీస్, అకౌంటింగ్, ఆర్ట్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
2) పాలిటెక్నిక్ / డిప్లొమా కోర్సులు :
- పాలిటెక్నిక్ లేదా డిప్లమో కోర్సులు అనేవి మూడు సంవత్సరాలను కోర్సులు. ఇందులో ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ , ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందేందుకు అవకాశం ఉంటుంది.
- ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత మీకు నేరుగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీరు ఉన్నత చదువులు చదవాలి అనుకుంటే ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో లీటర్ల ఎంట్రీ ద్వారా ప్రవేశం పొందే అవకాశం కూడా ఉంటుంది.
3) ఐటిఐ (Industrial Training Institute) :
- పదో తరగతి తర్వాత విద్యార్థులు ఐటిఐలో టెక్నికల్ మరియు ట్రేడ్ సంబంధిత శిక్షణ పొందవచ్చు. ఐటిఐలో ఫిట్టర్, ఎలక్ట్రిషన్, ప్లంబింగ్, వెల్డింగ్ వంటి కోర్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తక్కువ కాల వ్యవధిలోనే ఉపాధి అవకాశాలు పొందేందుకు ఐటిఐ కోర్సులు ఎంచుకోవచ్చు.
4) వృత్తి సంబంధిత కోర్సులు (Ocational Courses) :
- వృత్తి సంబంధిత కోర్సులు అనగా మీ అభిరుచికి తగిన విధంగా ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్ , కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి కోర్సులు పూర్తి చేయవచ్చు వీటి ద్వారా మీరు ప్రత్యేక నైపుణ్యాలు పొంది ఉద్యోగ అవకాశాలు పొందుతారు.
5) ఇంటిగ్రేటెడ్ కోర్సులు :
- కొన్ని విద్యాసంస్థలు ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా అందిస్తూ ఉన్నాయి. అనగా ఇంటర్ తో పాటు కోచింగ్ కూడా ఇస్తాయి. అనగా IIT, JEE, NEET, CA, etc.
పైన తెలిపిన వివిధ విద్యా అవకాశాలను పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు తమ అభిరుచి, సామర్థ్యం మరియు భవిష్యత్తు లక్ష్యాలను బట్టి సరైన కోర్సులను ఎంచుకోండి. మీరు పదో తరగతి తర్వాత ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనే విషయంలో సందిగ్ధంలో ఉంటే మీ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి. మీరు ఏ కోర్స్ చదివిన కష్టపడి మరియు ఇష్టపడి చదివితే విజయం తథ్యం. All the best 👍
ప్రతిరోజు వివిధ విద్యా , ఉద్యోగాల సమాచారం మీ వాట్సాప్ కి రావాలి అంటే వెంటనే క్లిక్ చేసి మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
పదో తరగతి తర్వాత ఉద్యోగ అవకాశాలు :
పదో తరగతి పూర్తి చేసిన తర్వాత పదో తరగతి అర్హతతోనే ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
ప్రభుత్వ రంగంలో అయితే రైల్వే, పోస్టల్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందవచ్చు. దీనికోసం పదో తరగతి అర్హతతోనే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి.
ప్రైవేట్ రంగంలో BPO, కాల్ సెంటర్లు, డేటా ఎంట్రీ, డెలివరీ బాయ్ మరియు రిటైల్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు :
- మీరు పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువులు చదివితే ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
- పదో తరగతి పూర్తి చేసిన తర్వాత త్వరగా ఉద్యోగం రావాలి అంటే డిప్లమో లేదా ఐటిఐ వంటి కోర్సులు చేసి ఉపాధి అవకాశాలు పొందవచ్చు.
- సరైన నిర్ణయం, శ్రమ మరియు పట్టుదల ఉంటే జీవితంలో మీరు విజయం సాధించవచ్చు.. మరియు మీ కలల భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. All the best 👍