Headlines

పదో తరగతి అర్హతతో తెలుగు రాష్ట్రాల్లో ఉండే రైల్వే స్టేషన్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | RRB Group D Notification 2025 in Telugu | South Central Railway jobs

కేవలం పదో తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వేలో (సికింద్రాబాద్ రైల్వేలో) పని చేసే అవకాశం వచ్చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 32,438 గ్రూప్ D పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సికింద్రాబాద్ రైల్వేలో 1,642 పోస్టులు ఉన్నాయి.

సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలకు అప్లై చేసి మీరు ఎంపిక అయితే సికింద్రాబాద్ రైల్వేలో పని చేసే అవకాశం ఉంటుంది.

10th పాస్ లేదా ITI పాస్ లేదా NCVT నుండి నేషనల్ ట్రేడ్ అప్రెంటిస్ లేదా తత్సమానమైన విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.

🏹 ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here 

ఈ ఉద్యోగాలకు జనవరి 23వ తేదీ నుండి ఫిబ్రవరి 22వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.

🏹 రైల్వే గ్రూప్ డి ఆన్లైన్ కోచింగ్ మీకు 499/- కే కావాలి అంటే క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి

Download Our App – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో వివిధ రకాల గ్రూప్ ‘ డి ‘ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥  మొత్తం పోస్టుల సంఖ్య : 

  • మొత్తం 32,438 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  • ఇందులో సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 1642 ఉద్యోగాలు ఉన్నాయి.

🔥 అర్హత : 

  • 10th పాస్ లేదా ITI పాస్ లేదా NCVT నుండి నేషనల్ ట్రేడ్ అప్రెంటిస్ లేదా తత్సమానమైన విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ విధానం : 

  • ఆన్లైన్ విధానంలో RRB వెబ్సైట్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ

  • ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు 23-01-2025 తేది నుండి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ

  • ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు 23-01-2025 తేది నుండి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ ఎడిట్ చేసుకునే తేదీలు : 

  • 26-02-2025 తేది నుండి 06-03-2025 తేది లోపు అప్లికేషన్ లో Edit చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : 

  • 01-01-2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : 

  • 01-01-2025 నాటికి 36 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

NOTE : 

  • 02-01-1989 నుండి 01-01-2007 మద్య పుట్టిన UR / EWS అభ్యర్థులు అర్హులు.
  • 02-01-1986 నుండి 01-01-2007 మద్య పుట్టిన OBC అభ్యర్థులు అర్హులు.
  • 02-01-1984 నుండి 01-01-2007 మద్య పుట్టిన SC / ST అభ్యర్థులు అర్హులు.

🔥 వయస్సులో సడలింపు : 

  • ప్రభుత్వ నిబంధనలు ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.

జీతము : 

  • ప్రారంభంలో బేసిక్ పే 18,000/- తో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు. (లెవెల్-1 ప్రకారం ఈ ఉద్యోగాలకు జీతము ఇస్తారు)

🏹 BHEL లో 400 జాబ్స్ నోటిఫికేషన్ – Click here

✅ ఫీజు :

  • SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు ఫీజు 250/- (SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు పరీక్ష రాసిన తరువాత వారు చెల్లించిన బ్యాంక్ చార్జీలు మినహాయించి పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు)
  • మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు. (బ్యాంకు చార్జీలు మినహాయించి 400/-  రూపాయలు రిఫండ్ చేయడం జరుగుతుంది)

🔥 ఎంపిక విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్షలో 100 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు. 
  • పరీక్ష మొత్తం 90 నిమిషాల సమయం ఉంటుంది. 
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. 
  • ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు మార్కులు తగ్గిస్తారు. (అంటే 3 ప్రశ్నలకు తప్పుగా ఆన్సర్ చేస్తే ఒక మార్కు తగ్గిస్తారు)

🔥 పరీక్ష సిలబస్ వివరాలు : 

  • పరీక్షలో జనరల్ సైన్స్ నుండి 25 ప్రశ్నలు , మాథెమాటిక్స్ నుండి 25 ప్రశ్నలు , జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 30 ప్రశ్నలు , జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ నుండి 20 ప్రశ్నలు ఇస్తారు.

🔥 శారీరక సామర్థ్య పరీక్షల వివరాలు : 

పురుష అభ్యర్థులు అయితే: 

  • 35 కిలోల బరువును 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరం తీసుకొని వెళ్ళాలి.
  • 4 నిమిషాల 15 సెకండ్స్ లో 1000 మీటర్ల దూరం పరుగెత్తగలగాలి.

మహిళా అభ్యర్థులు అయితే : 

  • 20 కిలోల బరువును 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరం తీసుకొని వెళ్ళాలి.
  • 5 నిమిషాల 40 సెకండ్స్ లో 1000 మీటర్ల దూరం పరుగెత్తగలగాలి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి

🔥 Download Full Notification – Click here 
🔥 Apply Online – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!