పదోతరగతి తరువాత ఈ కోర్స్ చేస్తే ఉజ్వలమైన భవిష్యత్తు | డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సు | Diploma in Fisheries Course Details in Telugu

Diploma in Fisheries Course Details in Telugu

ఆంధ్రప్రదేశ్ ఫిషిరీస్ యూనివర్సిటీ, కృష్ణా జిల్లా నుండి 2025- 26 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా ఇన్ ఫిషరీస్ లో అడ్మిషన్ పొందేందుకుగాను నోటిఫికేషన్ విడుదలయింది.

డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సు ( Diploma in Fisheries Course Details) :

10వ తరగతి లేదా తత్సమైన అర్హతతో ఈ డిప్లమో ఇన్ ఫిషరీస్ చేసేందుకు గాను అర్హత కలిగి ఉంటారు.

డిప్లమో ఇన్ ఫిషరీస్ అడ్మిషన్ పొందేందుకుగాను ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయింపు జరుగుతుంది.

డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సుతో ఈ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్నందున ఈ కోర్సులకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. 

🏹 AP లో పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here

ఆంధ్రప్రదేశ్ ఫిషిరీస్ యూనివర్సిటీ నుండి రిలీజ్ అయిన డిప్లమో ఇన్ ఫిషరీస్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు. 

🔥 డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సు కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ , కృష్ణా జిల్లా నుండి ప్రతి సంవత్సరం ఈ నోటిఫికేషన్ విడుదలవుతుంది.

🔥డిప్లొమా ఇన్ డిప్లొమా కాలపరిమితి :

  • ఈ డిప్లొమా కోర్సును విద్యార్థులు రెండు సంవత్సరాల లో పూర్తి చేయవచ్చు.

🔥డిప్లొమా ఇన్ మొత్తం సీట్ల వివరాలు :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 385 డిప్లొమా ఇన్ ఫిషరీస్ సీట్లు కలవు.
  • ఇందులో ప్రభుత్వం ఆధారిత సీట్లు – 55 (05 సీట్లు EWS కేటగిరీల వారికి కేటాయించారు)
  • అఫిలియేటెడ్ సీట్లు – 330 (ఇందులో 30 సీట్లు EWS కేటగిరి వారికి కేటాయించారు)

🔥డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సుకు ఉండాల్సిన అర్హతలు :

  • విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారి పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

🔥డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సుకు ఉండాల్సిన వయస్సు :

  • విద్యార్థులు 31/08/2025 నాటికి 15 సంవత్సరాలు నిండి యుండి 22 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.

🔥 డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సుకు దరఖాస్తు విధానం :

  • ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారు ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్ ద్వారా 30/05/2025 నుండి 20/06/2025 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సుకు ఉండాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు :

  • జనరల్ కేటగిరీ అభ్యర్థులు 800/- రూపాయలు అప్లికేషన్ మరియు కౌన్సిలింగ్ ఫీజు గా చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 400/- రూపాయలు చెల్లించాలి.

🔥 డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సుకు ఎంపిక విధానం :

  • పదవ తరగతి లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥డిప్లొమా ఇన్ ఫిషరీస్ నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 30/05/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 20/06/2025

👉 Click here to download Notification

👉 Click here for official website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!