ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. ఇప్పటివరకు లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించి తరువాత ప్రభుత్వం నుండి రాయితీ పొందేవారు. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే లబ్ధిదారుల అకౌంట్లో రాయితీ డబ్బులు జమ కానున్నాయి.
✅ Join Our What’sApp Group – Click here
ముందుగానే లబ్ధిదారుల అకౌంట్ లో దీపం పథకం రాయితీ డబ్బులు జమ:
ఇప్పటి వరకు దీపం పథకం అమలులో భాగంగా లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తరువాత లబ్ధిదారులు ముందుగా గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో స్వయంగా తమ స్వంత డబ్బులు చెల్లించిన కొన్ని రోజులకు వారి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ అయ్యేవి. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే రాయితీ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వం జమ చేసిన డబ్బులతోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ పొందవచ్చు.
దీపం పథకం కొత్త విధానం పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం :
ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో గుంటూరు మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఈ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని గ్యాస్ ఏజెన్సీల సహకారంతో ఈ పైలెట్ ప్రాజెక్టు చేపట్టామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు.