తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DMHO) వారి కార్యాలయం నుండి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (NUHM ) ప్రోగ్రాం లో భాగంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పనిచేసేందుకు గాను నలుగురు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో , కౌన్సిలర్ , ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు జూన్ 20వ తేదీ నుండి జూన్ 26వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. కౌన్సిలర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు జూన్ 26 న నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఉద్యోగాలను పొందవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా ఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు? అవసరమగు విద్యార్హత ఏమిటి ? ఎంత జీతం లభిస్తుంది వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- తెలంగాణ రాష్ట్ర మెడికల్ , హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క జగిత్యాల జిల్లా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వారి కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయు ఉద్యోగాలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ , కౌన్సిలర్ , ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య :
- మెడికల్ ఆఫీసర్ -04
- ల్యాబ్ టెక్నీషియన్ -01
- కౌన్సిలర్ -01
🔥విద్యార్హత :
- మెడికల్ ఆఫీసర్ : అభ్యర్థులు MBBS ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యొక్క రిజిస్ట్రేషన్ కలిగి వుండాలి.
- కౌన్సిలర్ : సైకాలజీ , సోషల్ వర్క్ , సోషియాలజీ , హ్యూమన్ డెవలప్మెంట్, నర్సింగ్ లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి 3 సంవత్సరాలు అనుభవం కలిగి వుండాలి.
- లేదా సంబంధిత విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- ల్యాబ్ టెక్నీషియన్: మెడికల్ లేబరేటరీ టెక్నాలజీలో డిగ్రీ లేదా డిప్లమో చేసిన అభ్యర్థులు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పని అనుభవం అవసరం అగును.
🔥వయోపరిమితి :
- 18 సంవత్సరాలు నిండి యుండి 44 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ల్యాబ్ టెక్నీషియన్ మరియు కౌన్సిలర్ ఉద్యోగాలకు 21 సంవత్సరాలు నిండి యుండి 45 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేదీగా పరిగణించారు.
- ఎస్సీ , ఎస్టి , బీసీ , ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & దివ్యాంగులు వారికి 10 సంవత్సరాలు వయోసడలింపు లభిస్తుంది.
🔥 దరఖాస్తు విధానం :
- మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారు అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకొని , ప్రింట్ తీసి ఫిల్ చేయాల్సివుంది.
- దరఖాస్తు తో పాటు సంబంధిత ధృవ పత్రాలను ( self attested) కాపీ లను కార్యాలయ చిరునామాకు నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందించాలి.
🔥దరఖాస్తు అందసేయవలసిన చిరునామా :
District medical & Health officer , jagital , Room no :226 , 2 nd floor , IDOC, jagital.
🔥దరఖాస్తు ఫీజు :
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జగిత్యాల వారి పేరు మీదుగా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించ వలసి ఉంటుంది.
🔥 ఎంపిక విధానం :
- మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి వ్రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు గాను ఎంపిక విధానం లో ప్రస్తావించగా , 90 మార్కుల వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. వయస్సు కి 10 మార్కులు కేటాయించారు.
🔥 కౌన్సిలర్ & ల్యాబ్ టెక్నీషియన్ ల ఎంపిక కొరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ :
- ఈ నోటిఫికేషన్ సంబంధించి కౌన్సిలర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల ఎంపిక కొరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
- అర్హత కలిగిన అభ్యర్థులు జగిత్యాలలోని DMHO ఆఫీస్ నకు 26/06/2025 ఉదయం 10:00 గంటలకు హాజరు కావాలి.
- ప్రాథమికంగా ఈ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ ప్రాదిపాదికన మూడు నెలలకు పాటు పనిచేసేందుకు గాను ఎంపిక చేస్తారు.
🔥జీతం :
- మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 52,000 రూపాయలు & కౌన్సిలర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను ఎంపిక అయిన వారికి నెలకు 18,000 రూపాయల జీతం లభిస్తుంది.
🔥ముఖ్యమైన తేదీలు :
- మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 20/06/2025
- మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 26/06/2025
- కౌన్సిలర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ : 26/06/2025
👉 Click here to download notification
👉 Click here for official website