తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | జాబ్స్

తెలంగాణ జిల్లా కోర్ట్ ఉద్యోగాలు
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో గల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ నుండి కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయింది.

ఆఫ్లైన్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకునే ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అనగా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి ? జీతం ఎంత లభిస్తుంది ? వంటి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.

✅ ఈ స్కాలర్షిప్ కు అప్లై చేస్తే సంవత్సరానికి 1,25,000/- ఇస్తారు – Click here

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ , నారాయణపేట నుండి ఈ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపాదికన భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :

  • కోర్ట్ అసిస్టెంట్ – 01
  • కోర్ట్ అటెండెంట్ – 01
  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ నారాయణపేట నందు పనిచేయవలసి ఉంటుంది.

🔥 విద్యార్హత :

  1. కోర్ట్ అసిస్టెంట్ : ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలు ఉత్తీర్ణత అయి ఉండాలి. లేదా తత్సమన అర్హత కలిగి ఉండాలి.
  2. కోర్ట్ అటెండెంట్ : కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఏడవ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోట్ : న్యాయ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ , ఎగ్జామినర్ , టైపిస్ట్ , కాపీస్ట్ మరియు అంతకుమించి అత్యున్నత ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన ఉద్యోగులు కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు & అటెండర్ మరియు ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారు కోర్టు అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥 వయస్సు :

  • 18 సంవత్సరాలు నిండి యుండి 34 సంవత్సరాలలోపు వయసు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయసు నిర్ధారణ కొరకు 01/08/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
  • ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు లభిస్తుంది.
  • రిటైర్డ్ ఉద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే వారికి 65 సంవత్సరాలు లోపు వయస్సు ఉండాలి

🔥 దరఖాస్తు చేయు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
  • నోటిఫికేషన్ లో ప్రస్తావించిన దరఖాస్తు ను ప్రింట్ తీసుకొని , ఫిల్ చేసి , సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి , కార్యాలయానికి అందచేయాలి.
  • దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ గా 15/09/2025 ను నిర్ణయించారు. సోమవారం నుండి శుక్రవారం సాయంత్రం 05:00 గంటల లోగా మాత్రమే దరఖాస్తు సమర్పించవలసి ఉంటుంది.

🔥 దరఖాస్తు తో పాటు సమర్పించవలసిన ధ్రువపత్రాలు :

  • 1.విద్యార్హత సర్టిఫికెట్లు
  • 2. డేట్ ఆఫ్ బర్త్ కొరకు ప్రూఫ్ సర్టిఫికెట్
  • 3. దరఖాస్తు పైన ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలి.
  • 4. రిటైర్డ్ అధికారులు అయితే రిటైర్మెంట్ ప్రొసీడింగ్స్

🔥 రెమ్యునరేషన్ :

  • కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 3000 రూపాయలు కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 5000 రూపాయలు లభిస్తుంది.
  • ఈ ఉద్యోగాలను రెండేళ్ల కాలపరిమితి కొరకు భర్తీ చేస్తున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు వారి ఆదేశాల మేరకు కొనసాగింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఎంపిక విధానం ఉంటుంది.
  • ఒక్కొక్క ఉద్యోగానికి 20 కంటే ఎక్కువగా దరఖాస్తుల వస్తే అభ్యర్థి యొక్క విద్యార్హత మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి , ఉద్యోగాలకు అన్ని విధాలా సరిపోయిన వారిని ఎంపిక చేయడం జరుగుతుంది.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • వయస్సు నిర్ధారణ కొరకు కటాఫ్ తేదీ : 01/08/2025
  • ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ : 15/09/2025

👉 CLICK HERE FOR NOTIFICATION AND APPLICATION

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!