తెలంగాణ జిల్లా ఉపాధి కార్యాలయాల ద్వారా ఉద్యోగాలు | Telangana Employment Offices Jobs Mela Details | Latest jobs in Telangana

తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఈనెల 28 , 29 తేదీల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలకు హాజరయ్యి తమకు అర్హత ఉండే ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డి.ఫార్మసీ , బి,ఫార్మసీ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాలకు హాజరు కావచ్చు. వయసు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🏹 తిరుమల తిరుపతి దేవస్థానం జాబ్స్ – Click here 

🏹 రైల్వేలో 675 పోస్టులకు నోటిఫికేషన్ – Click here 

జిల్లాల వారిగా జరుగుతున్న జాబ్ మేళాల వివరాలు క్రింద విధంగా ఉన్నాయి : 

వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల్లో జాబ్ మేళాలు : 

  • ఈనెల 28 , 29 తేదీల్లో ఈ జాబ్ మేళాలో నిర్వహిస్తున్నారు.
  • వరంగల్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీలో ఖాళీలకు, హనుమకొండ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో యాక్సిస్ బ్యాంక్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. 
  • పదో తరగతి, ఇంటర్, డి.ఫార్మసీ, బి.ఫార్మసీ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ కు హాజరు కావచ్చు.
  • వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.
  • ఈ జాబ్ మేళాకు అర్హత ఉండేవారు ములుగు రోడ్డులో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయాల్లో సంబంధిత సర్టిఫికెట్లతో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 
  • మరి కొన్ని వివరాలు కోసం అభ్యర్థులు జిల్లా ఉపాధి అధికారి ఫోన్ నెంబర్ 7893394393 ను సంప్రదించవచ్చు.

జనగామ జిల్లాలో జాబ్ మేళా వివరాలు : 

  • ఈనెల 28వ తేదీన జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఉండే జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 
  • హైదరాబాద్ కు చెందిన జ్యోతి ఎంటర్ప్రైజెస్, ఇన్స్టాల్ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైయర్స్ / మెయింటెనెన్స్ కు సంబంధించిన ప్రైవేట్ సెక్టర్లో 20 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 
  • పదో తరగతి , ఇంటర్, డిగ్రీ, ఐటిఐ వంటి విద్యార్హతలు పూర్తిచేసి 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 
  • అర్హత ఉన్నవారు తమ సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో జిల్లా కలెక్టరేట్ లోని , జిల్లా ఉపాధి కార్యాలయం, S-8, కాన్ఫరెన్స్ హాల్ కి హాజరు కావలసి ఉంటుంది. 
  • అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 7995430401, 9502816498 అనే నెంబర్లకు సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!