తెలంగాణ రాష్ట్రంలో జూలై 23న స్కూల్స్ మరియు కాలేజీలు బంద్ కారణంగా మూతపడనున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ప్రభుత్వ స్కూల్స్ మరియు కాలేజీలు మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. వీటితో పాటు మరి కొన్ని ఇతర డిమాండ్స్ కూడా చేస్తున్నారు.. వాటి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..
🏹 Join Our What’sApp Group – Click here
వామపక్ష విద్యార్ధి సంఘాల డిమాండ్స్ :
- ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి.
- అన్ని విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. నిధులు కేటాయించాలి.
- ఖాళీగా ఉన్న టీచర్, MEO, DEO పోస్టులను భర్తీ చేయాలి.
- పెండింగ్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలి.
- ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి.
- RTC బస్సుల్లో విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలి.
- NEP – 2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలి.
✅ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ, రేషన్ కార్డు స్టేటస్ ఇలా చూడండి – Click here