AP Junior Colleges Guest Faculty Salaries Increased G.O Details
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వారికి పారితోషకం భారీగా పెంచింది. గతంలో గంటకు 150/- రూపాయలు చొప్పున చెల్లించేవారు. ప్రస్తుతం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం గంటకు 375/- రూపాయలు చొప్పున చెల్లిస్తారు. గరిష్టంగా 72 గంటలకు గాను నెలకు 27,000/- వరకు పారితోషకం చెల్లించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 12వ తేదీన G.O RT.NO.181 జీవో విడుదల చేసింది.
🏹 AP లో సూపర్ సిక్స్ పథకాలు ప్రారంభ తేదీలు ఇవే – Click here

తాడేపల్లి లో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా తాజాగా విడుదల చేసిన జీవోలో తెలియజేశారు.