ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు గాను ప్రణాళిక చేస్తుంది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాలలో గల మహిళలకు వివిధ పథకాల ద్వారా బ్యాంకు రుణాలు మంజూరు చేస్తూ, మహిళలు స్వయంగా అభివృద్ధి చెందేలా మహిళల్లో మార్పు తీసుకువచ్చి, మహిళా సాధికారత సాధించే ప్రయత్నం చేస్తుంది.
ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతి పథకాన్ని ప్రారంభించింది. డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి అర్హులు. ఈ పథకం ద్వారా వీరికి వడ్డీ లేని రుణాలను అందిస్తారు.
ఈ ఉన్నతి పథకం యొక్క పూర్తి సమాచారం అనగా ఎవరు అర్హులు? ఎంత మొత్తాన్ని లోన్ గా ఇస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి వంటి పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 ఉన్నతి పథకం ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం :
- ఈ ఉన్నతి పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వున్నప్పటి నుండి అమలు లో ఉంది.
- ఎస్సీ, ఎస్టీ మహిళల ఆర్థిక బలోపేతం కొరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చాయి.
- అయితే ఈ ఉన్నతి పథకం ద్వారా ప్రారంభం లో ఒక్కో సభ్యురాలికి 20 వేల నుండి 50 వేల వరకు బ్యాంక్ ద్వారా రుణం అందించేవారు.
- అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచి ఎస్సీ, ఎస్టీ మహిళలకు 5 లక్షల వరకు రుణం అందించనున్నారు.
🔥ఉన్నతి పథకం అర్హతలు మరియు నిబంధనలు:
- ఈ రుణం పొందేందుకుగాను స్వయం సహాయక సంఘాల్లో ఉన్న ఎస్సీ మరియు ఎస్టీ మహిళలు మాత్రమే అర్హత కలిగి ఉంటారు.
- రుణాన్ని పొందిన సభ్యులు కచ్చితంగా నెలవారి వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాలి.
- రుణాన్ని పొందేందుకుగాను జీవనోపాధిని కల్పించే యూనిట్ ఉండాలి. లేదా వచ్చిన రుణంతో కొత్త యూనిట్ ప్రారంభించాలి.
- రుణం చెల్లించే మహిళలకు బ్యాంకు వారు బీమా సదుపాయం కూడా కల్పిస్తారు.
🔥ఉన్నతి పథకం ద్వారా రుణం పోయేందుకు గాను దరఖాస్తు విధానం :
- ఉన్నతి పథకం ద్వారా రుణం పొందేందుకుగాను అర్హత కలిగిన మహిళలు తమ గ్రామ సంఘం కు దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది. ఇందుకుగాను గ్రామంలో గల విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్ సహాయం చేస్తారు.
- ఆ దరఖాస్తులు బ్యాంకు వారికి అందజేస్తారు.
- బ్యాంకు వారు రుణ దరఖాస్తును పరిశీలించి మరియు దరఖాస్తుదారుడు ఎంపీక చేసుకున్న జీవనోపాధి యూనిట్ ని కూడా పరిశీలిస్తారు.
- యూనిట్ పరిశీలించిన తర్వాత దరఖాస్తుదారులు రుణం పొందేందుకుగాను అర్హులైతే బ్యాంక్ వారు రుణాన్ని మంజూరు చేస్తారు.
- క్రమగతంగా లోను బకాయిలు చెల్లుబాటు చేస్తే మాత్రమే ఉన్నతి, ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.
- డ్వాక్రా సంఘాలలో గల అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ మహిళలు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.