ఏపీ ప్రజలకు ఇక సులభంగా ప్రభుత్వ సేవలు | AP Government Mana Mithra What’s App Services | AP Government Latest News

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

మీరు విద్యార్థా ? మీకు కుల ధ్రువీకరణ పత్రం , ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటివి కావాలా?

మీరు రైతా ? మీకు 1- B , అడంగళ్ వంటివి కావాలా?

మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయాలి అనుకుంటున్నారా?

మీరు పదివ తరగతి , ఇంటర్మీడియట్ విద్యార్థా ? మీ పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారా? 

లేకా మరేదైనా సర్వీస్ పొందాలి అనుకుంటున్నారా?

అయితే మీరు ఎక్కడికీ వెళ్లకుండా కేవలం ఇంటి దగ్గరే కూర్చుని వాట్సప్ లో  “ Hi “ అని మెసేజ్ చేయడం ద్వారా పైన పేర్కొన్న సర్వీసులు మాత్రమే కాకుండా మొత్తం 250 సర్వీసుల వరకు పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ రూపంలో వివిధ ధ్రువపత్రాలు & సర్వీసులు పొందేందుకు గాను ప్రతిష్ఠాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక మన మిత్ర పేరుతో వాట్సప్ సర్వీసులు ప్రారంభించింది.

మీ సౌకర్యమే మా ప్రాధాన్యం. ప్రజల చేతిలో ప్రభుత్వం అనే నినాదం తో పౌర సేవలను సులభంగా మరియు సమర్ధవంతంగా అందించేందుకు నిబద్ధతతో ఈ కార్యక్రమం తీసుకువచ్చారు. ఇటీవల ఇంటర్ ఫలితాలు కూడా రాష్ర్ట ప్రభుత్వం నీ వాట్సాప్ సర్వీస్ ద్వారానే విడుదల చేసింది.

మన మిత్ర ద్వారా ఏ విధంగా సర్వీసులు పొందాలో ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదివి తెలుసుకోండి.

🔥 ఎప్పుడు ప్రారంభించారు ? :

ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం వచ్చాక వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని, ప్రజలకు అతి చేరువలో సర్వీసులు అందజేసేందుకు గాను వాట్సాప్ అప్ వారితో ఒప్పందం కుదుర్చుకొని జనవరి 30 , 2025 నుండి  ఈ సర్వీసులను మన మిత్ర పేరు తో తీసుకొని వచ్చారు.

🔥 ఎలాంటి సర్వీసులు పొందవచ్చు? :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి 36 డిపార్ట్మెంట్లకు చెందిన సుమారు 160 కి పైగా సర్వీస్ లను తొలి విడతలో పొందేందుకు గాను అవకాశం కల్పించారు.

ప్రస్తుతం ఏప్రియల్ 15 వ తేదీ నుండి 250 కి పైగా సర్వీసులు పొందేందుకు అవకాశం కల్పించారు. 

ఇందులో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వీసులు, దేవాదాయ బుకింగ్ సర్వీసులు, ఫిర్యాదు పరిష్కారణ సేవలు , APSRTC సేవలు , ఎనర్జీ సేవలు , పురపాలక సేవలు , ఆరోగ్య కార్డు సేవలు , పోలీసు శాఖ సేవలు

అన్నా క్యాంటీన్ , మైన్స్ & భౌగోళిక సేవలు , విద్యా సేవలు వంటి వివిధ సేవలను అందిస్తున్నారు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 ఈ సర్వీసులను పొందడమెలా? :

పౌరులు ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా ప్రవేశపెట్టిన మన మిత్ర  వాట్సాప్ నెంబర్ 9552300009 ను సేవ్ చేసుకోవాలి.

తర్వాత ఆ కాంటాక్ట్ ను వాట్సాప్ లో ఓపెన్ చేసి, Hi అని మెసేజ్ చేస్తే, రెస్పాన్స్ మెసేజ్ “సేవను ఎంచుకోండి” అని చూపిస్తుంది.

అక్కడ మీరు ఏ డిపార్ట్మెంట్ వారి సేవ కావాలో ఆ డిపార్ట్మెంట్ పేరు పై క్లిక్ చేసి, మీకు కావాల్సిన సేవను ఎంచుకోవాలి.

మీ డీటెయిల్స్ ఫిల్ చేసి,ఆ తర్వాత ఏమైనా ధ్రువపత్రాలు అప్లోడ్ చేయమంటే ఆ ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాలి (అవసరమగు సర్వీసులకు)

ఆ తర్వాత పేమెంట్ చేస్తే, మీరు ఆ సర్వీసుకు దరఖాస్తు చేసుకున్నట్లే.

మీరు ఆ సర్వీస్ కి అర్హులు అయితే , అధికారులు పరిశీలించి, సర్వీస్ అందిస్తారు.

🔥 ఏప్రిల్ 15 నుండి అవగాహన కార్యక్రమాలు ప్రారంభం : 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ , వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది.

గ్రామ , వార్డు సచివాలయం సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించేందుకు గారు ఇంటింటికి వచ్చి , అందరికి అవగాహన కల్పించి, ఫంప్లేట్ లను కుండా అందజేస్తారు.

మన మిత్ర వాట్సప్ సర్వీస్ లతో పాటు “ శక్తి యాప్ “  సైబర్ నేరాల పైన కూడా అవగాహన కల్పించనున్నారు.

ప్రజలందరూ ఈ సర్వీసుల కోసం తెలుసుకొని, అవసరం ఉంటే వినియోగించుకోగలరు.

సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం , కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *